Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Praja Palana Health Programs | ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Praja Palana Health Programs | ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు

నిజామాబాద్

Praja Palana Health Programs | ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేశామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ తెలిపారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 5, 2026 8:47 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Praja Palana Health Programs |
Praja Palana Health Programs | ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Praja Palana Health Programs | జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో (nizamabad health department) ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేశామని జిల్లా వైద్యారోగ్యశాఖ(dmho nizamabad) అధికారిణి రాజశ్రీ తెలిపారు. ఈ మేరకు గురువారం తన ఛాంబర్​లో జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో సమావేశం నిర్వహించారు.

Contents
  • Praja Palana Health Programs | 99 రోజుల ప్రణాళికలో భాగంగా..
    • Praja Palana Health Programs | జిల్లాలోని 38 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో..
      • Praja Palana Health Programs | డిజిటల్​ రిపోర్టింగ్​..
      • టెలీమానస్ కరపత్రాల ఆవిష్కరణ

Praja Palana Health Programs | 99 రోజుల ప్రణాళికలో భాగంగా..

99 రోజుల ప్రణాళికలో భాగంగా.. మాతా శిశు మరణాలతో పాటు నెలలోపు శిశువుల మరణాల సంఖ్యను తగ్గించేవిధంగా ప్రణాళిక  (telangana health schemes) వేశామని డీఎంహెచ్​వో తెలిపారు. అలాగే ప్రత్యేక వైద్య నిపుణులతో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఛాతివైద్య నిపుణులు, క్యాన్సర్ రోగుల కోసం అంకాలజిస్ట్, కంటి వైద్య నిపుణులు, చర్మవ్యాధి నిపుణులు, మానసిక వ్యాధి నిపుణులు, స్త్రీ వైద్యం, ఆర్థోపెడిక్, దంత వైద్య సేవలు అందించబడతాయన్నారు.

Praja Palana Health Programs | జిల్లాలోని 38 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో..

ఈ స్పెషాలిటీ వైద్య నిపుణులు జిల్లాలోని 38 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (Praja Palana Health Programs) రోగులకు ఉచిత వైద్య ఆరోగ్య సేవలు అందిస్తారని డీఎంహెచ్​వో అన్నారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలో భాగంగా 14ఏళ్లలోపు కిశోర బాలికలకు హెచ్​పీవీ టీకాలను (hpv vaccination program) ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో జీజీహెచ్​లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 30ఏళ్లు పైబడిన అందరికీ జీవనశైలిలో భాగంగా వచ్చే వ్యాధులైన గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ముందస్తుగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

Praja Palana Health Programs | డిజిటల్​ రిపోర్టింగ్​..

అదేవిధంగా అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల (Praja Palana Health Programs) ద్వారా అందిస్తున్న ఆరోగ్య సేవలను ఆన్​లైన్​లో నమోదు చేసి డిజిటల్ రిపోర్టింగ్ చేయాలని డీఎంహెచ్​వో తెలిపారు. జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలను  (maternal child health india) సందర్శించి విద్యార్థులందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు (Praja Palana Health Programs) నిర్వహించి చికిత్స అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 99 రోజుల కార్యక్రమాల్లో ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 11 వరకు ఆరోగ్య వారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆరో తేదీన ఆహార పదార్థాల నాణ్యత, సరైన పోషకాహారాన్ని తీసుకునేలా ఈట్ రైట్​పై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు.

ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (public health initiatives telangana) సందర్భంగా ఉత్తమ సేవలందించిన వైద్యులకు వైద్య సిబ్బందికి బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుందన్నారు. ఏప్రిల్​ 8న హెచ్ఐవీ ఎయిడ్స్​పై అవగాహన, నిర్ధారణ పరీక్షల శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 9వ తేదీన మహిళలు, తల్లుల సంరక్షణపై, ఏప్రిల్ 10వ తేదీన హోమియోపతి, ఆయుష్ వైద్యసేవలు అందించడం జరుగుతుందన్నారు. 11న ఔషధ నియంత్రణ, రెగ్యులేటరీనీ బలోపేతం చేయడంపై కార్యక్రమం ఉంటుందన్నారు. హెచ్​వీవీ టీకాల పంపిణీపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవడం, ఆరోగ్య సేవలు అన్నింటిని డిజిటల్ రిపోర్టింగ్ చేయడం, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులోని మహిళలందరికీ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం జరుగుతుందన్నారు.

టెలీమానస్ కరపత్రాల ఆవిష్కరణ

మానసిక ఒత్తిడిలో ఉంటూ పరీక్షలు అంటే భయపడుతూ ఇతర మానసిక సమస్యలతో బాధపడే విద్యార్థులు యువతీయువకుల కోసం మానసిక నిపుణుల ద్వారా ఉచిత కౌన్సెలింగ్​ ఇప్పిస్తామని డీఎంహెచ్​వో తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి మానసిక సమస్యలున్న 14416 టోల్ ఫ్రీ నంబర్​కు సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్, పాలనాధికారి సుమంత్ కుమార్, ఉపవైద్యాధికారులు రవీందర్, సమత, అశ్విని, ప్రోగ్రాం అధికారులు శ్వేత, వెంకన్న, సుప్రియ, వెంకటేష్, శిఖరా, దివ్య, చైతన్య, అవంతి తదితరులు పాల్గొన్నారు.

HPV Vaccination Launch

ఇది చదవండి : HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ

Wines Closed on Holi | హోలీ పండుగకు వైన్స్​లు బంద్: సీపీ సాయిచైతన్య
Kendriya Vidyalaya Recruitment | కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు
Kamareddy Hailstorm Alert | కామారెడ్డిలో రాళ్ల వర్షం.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
Ramzan Celebrations Nizamabad | ఘనంగా రంజాన్​ వేడుకలు.. మైనారిటీల ప్రార్థనలు..
Lakshmi Narasimha Dolotsavam | కనులపండువగా లక్ష్మీనృసింహునికి ఊయల సేవ
TAGGED:hpv vaccination programnizamabad health departmentpraja palana health programstelangana health schemes
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Realme Narzo Power 5G Realme Narzo Power 5G | భారీ బ్యాటరీతో రియల్‌మీ ‘పవర్’ విడుదల.. ప్రారంభ ఆఫర్‌లో రూ. 4 వేల వరకు తగ్గింపు
Next Article India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?