అక్షరటుడే, ఇందూరు: Prajapalana Pragathi Pranalika | ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో (Prajapalana Pragathi Pranalika) అందరినీ భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Ramakrishna Rao CS) సూచించారు. పంచాయతీరాజ్ (Municipal administration Telangana) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కార్యదర్శి శ్రీదేవి, సెర్ఫ్ సీఈవో దివ్య, ప్రణాళికా కార్యదర్శి గౌరవ్ ఉప్పల్తో కలిసి మంగళవారం హైదరాబాద్ నుంచి వీసీలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.
Prajapalana Pragathi Pranalika | 12న పూర్తిస్థాయి అవగాహన కార్యక్రమం..
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ… ఈనెల 12న నూతనంగా (Telangana governance) ఎంపికైన సర్పంచులు మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, మేయర్లకు 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యచరణ పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు ఏ విధంగానైతే ప్రామాణికమైన (Telangana development plan) ఫలితాలు అందుతాయో.. ఆ కోణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ (Telangana government) ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, సామాజిక రుగ్మతల నివారణ, విద్యావైద్యం తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగేలా ఉండాలన్నారు. శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానించాలని తెలిపారు.
Prajapalana Pragathi Pranalika | ప్రజాప్రతినిధులకు..
నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లాలో ఏర్పాట్లు చేసినట్లు ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో నిజామాబాద్ నగరపాలక సంస్థలతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల (Municipal administration Telangana) ఛైర్మన్లు కౌన్సిలర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే గ్రామ పంచాయతీల (Panchayati Raj training) సర్పంచులకు మరో వేదికలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, సీపీవో రతన్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, ఉమామహేశ్వర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Damodar Rajanarsimha | ప్రైవేట్ ఆస్పత్రులపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం

