అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Prajavani Complaints | ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు సోమవారం పలువురు బాధితులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు.
Prajavani Complaints | వెనువెంటనే పరిష్కరించాలి..
సంబంధిత అధికారులు అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి 140 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar), ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Gold Price Drop | సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గిన పసిడి

