అక్షరటుడే, ఇందూరు: Prajavani Complaints Resolution | ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా 95 ఫిర్యాదులు స్వీకరంచారు.
Prajavani Complaints Resolution | మండల స్థాయి సభలను విజయవంతం చేయాలి
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా 16న మండల స్థాయి సభలు సక్సెస్ అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈనెల 2న నిర్వహించిన గ్రామ సభలు విజయవంతం అయ్యాయని, అదే స్ఫూర్తితో మండల స్థాయి సభలను కూడా జరిగేలా చూడాలన్నారు. మండల సభ నిర్వహణ సమయానికి ముందే ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పెండింగ్ బిల్లులు, రేషన్ కార్డులు, పెన్షన్ లు వంటి వాటికి సంబంధించి గ్రామ సభలలో అందిన దరఖాస్తులను తప్పనిసరిగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Prajavani Complaints Resolution | జనాభా గణనకు ప్రాధాన్యత..
జనాభా గణన (Census)కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అన్ని మున్సిపల్ పట్టణాలు, మండలాల్లో ఈ ప్రక్రియ క్షేత్రస్థాయిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రోజువారీగా ఈ ప్రక్రియ అమలును పర్యవేక్షించాలని సబ్ కలెక్టర్లను, ఆర్డీవోను ఆదేశించారు. ఎన్యుమరేషన్ ప్రక్రియకు విద్యాశాఖ పూర్తి సహకారం అందించేలా చూడాలని, ఈ విషయంలో ఎవరైనా నిరాకరిస్తే అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారులు సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలను విరివిగా సందర్శిస్తూ, విద్యార్థులు వసతి, సదుపాయాలను పరిశీలించాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Gurukulam Inter Admissions | సంక్షేమ గురుకులాల్లో ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
