అక్షరటుడే, భీమ్‌గల్: Prashanth Reddy support | బాల్కొండ నియోజకవర్గంలో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (Former Minister and MLA Prashanth Reddy) అన్నారు. ఈ మేరకు భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లో పలు బీఆర్ఎస్ నాయకులు, ఇతర కుటుంబాలను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.
Prashanth Reddy support | భీమ్‌గల్ మండలంలోని..
మండలంలోని చేంగల్, గోన్‌గొప్పుల గ్రామాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. కాగా.. ఇటీవల మృతి చెందిన పలువురు పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. చేంగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మోండేలా లింగం సోదరుడు ఇటీవల మరణించగా, ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం గోన్‌గొప్పుల గ్రామంలో బీఆర్ఎస్ (BRS) నాయకులు భూమేశ్వర్ తల్లి మరణించడంతో వారి కుటుంబాన్ని ఓదార్చారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి, ఆయా కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Prashanth Reddy support | వేల్పూర్ మండలంలో..
వేల్పూర్ మండలం (Velpur Mandal) జానకంపేట్ గ్రామంలో ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. గ్రామంలోని పలువురు ఆత్మీయుల కుటుంబాల్లో సంభవించిన మరణాలపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రొక్కం కిషన్ తండ్రి ఇటీవల మరణించడంతో వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుమ్ముల ప్రవీణ్ కుమారులు అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని కలిసి ఎమ్మెల్యే ఓదార్చారు. పుత్రశోకంలో ఉన్న ప్రవీణ్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Hindu Sammelan Gandhari | కులభేదం లేని హిదూ సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలి..
