అక్షరటుడే, కామారెడ్డి: PRC implementation demand | ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెళ్లలోనే పీఆర్సీ(PRC) సిఫార్సులను (teachers demands) అమలు చేస్తామని ఇచ్చిన మాట తప్పడం సరికాదని ఎస్టీయూ(STU union) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో (Kamareddy) శనివారం ఏర్పాటు చేసిన జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
PRC implementation demand | పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
జుట్టు గజేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం(telanagan Education) ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సీపీఎస్‌ను (pension scheme) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రతినెలా రూ.1500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కావడంలేదని విమర్శించారు. బకాయిపడిన నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య కార్డుల పథకం వెంటనే అమలు చేయాలన్నారు.
PRC implementation demand | హెల్త్‌కార్డులు ఇవ్వాలి
మోడల్, గురుకుల, ఆశ్రమ, కేజీబీవీ, యూఆర్ఎస్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని (education sector) ఆయన డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష, కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సమ్మె కాలం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ కారణంగా ఖాళీ అయిన జిల్లా అధ్యక్ష స్థానంలో (government promises) సయ్యద్ ఖలీమొద్దీన్ను అధ్యక్షుడిగా, అదనపు ప్రధాన కార్యదర్శిగా నాజియా మస్రత్, ఆర్థిక కార్యదర్శిగా శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సాబేర్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పంపరి ప్రవీణ్ కుమార్, రాజు, రిజ్వనా అఫ్రీన్, ఎండీ ఖాజా మొయినుద్దీన్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

