Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Pre Primary Graduation Day | కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రీప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Pre Primary Graduation Day | కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రీప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే

నిజామాబాద్

Pre Primary Graduation Day | కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రీప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 9:46 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
11 గంటలు ago
Share
Pre Primary Graduation Day

అక్షరటుడే, ఇందూరు: కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రీప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే (Pre Primary Graduation Day) నిర్వహించారు. నగరంలోని కేవోఎస్​ ప్రగతినగర్​లో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Contents
  • Pre Primary Graduation Day | స్కూల్​ స్థాయిలోనే ఆధునిక విద్య అవసరం
    • Pre Primary Graduation Day | లీడర్​షిప్​ క్వాలిటీస్​ పెరుగుతాయి..
      • ఐఐటీ, మెడికల్​లో విజయానికి స్కూల్ విద్యే పునాది

Pre Primary Graduation Day | స్కూల్​ స్థాయిలోనే ఆధునిక విద్య అవసరం

ఈ సందర్భంగా కేవోఎస్​ డైరెక్టర్​ సీహెచ్​ తేజస్విని మాట్లాడుతూ.. ఆధునిక విద్యా విధానంలో అన్నివిధాల డెవలప్​మెంట్​ ఉంటేనే జాతీయస్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ మెడికల్​లో రాణించగలుగుతారని తెలిపారు. స్కూల్​ స్థాయి నుంచే పిల్లలు పిల్లలకు అన్ని విధాల ముందుండేలా రెగ్యులర్ విద్యతో పాటు నిజమైన ఐఐటీ మెడికల్ ఫౌండేషన్ ఇంటర్మీడియట్/ఎంసెట్ కోసం నిష్ణాతులతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నామన్నారు. అలాగే స్ట్రెస్ రిలీఫ్​, ఫిజికల్ స్ట్రెంత్ కోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్​లో పిల్లలు చురుకుగా పాల్గొనేలా స్పెషల్​ కోచ్​ పర్యవేక్షణ ఉంటుందన్నారు. అలాగే మెంటల్ స్ట్రెంత్ కోసం రోబోటిక్స్, ఒలంపియాడ్ ఎగ్జామ్స్ కాంపిటీషన్స్ ద్వారా విద్యార్థులు ఆల్ రౌండ్ డెవలప్​ మెంట్​ అవుతారని వివరించారు.

Pre Primary Graduation Day

Pre Primary Graduation Day | లీడర్​షిప్​ క్వాలిటీస్​ పెరుగుతాయి..

కేవోస్ డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు మాట్లాడుతూ తాము చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో లీడర్​ షిప్​ క్వాలిటీస్​ పెరుగుతాయని తెలిపారు. రెగ్యులర్ విద్యతోపాటు ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ కోసం ఎంసెట్ స్థాయి లెక్చరర్స్​తో బోధన చేయిస్తున్నామన్నారు. విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇంటర్నల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని వివరించారు. అలాగే శారీరక దృఢత్వం కోసం స్పోర్ట్స్ కోచ్​ల ద్వారా ఇంటర్నల్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా టెక్నికల్​గా రాణించడం కోసం రోబోటిక్స్, ఏఐ బేస్డ్ కాంపిటీషన్స్, ఐఐటీ బేస్డ్ ఒలంపియాడ్ ఎగ్జామ్స్, ఇలా ఎన్నో విషయాల్లో విద్యార్థులకు విద్యనందిస్తూ మందుకు సాగుతున్నామని చెప్పారు. ఇలాంటి అన్ని కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి.. సమాజంలో గొప్ప వ్యక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు.

Pre Primary Graduation Day

ఐఐటీ, మెడికల్​లో విజయానికి స్కూల్ విద్యే పునాది

జాతీయస్థాయి పరీక్షలైన ఐఐటీ, మెడికల్​లో విద్యార్థుల విజయానికి స్కూల్ విద్యే పునాది అవుతుందని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్​ రజనీకాంత్​ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు నూతన విద్యా విధానంలో భాగంగా జాతీయ దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. స్కూల్ స్థాయిలోనే ఉత్తమ విద్య అందించాలన్నారు. నిర్ణయం మీదైతే భవిష్యత్తు మీ పిల్లలది అవుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతి ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ ప్రదానోత్సవం నిర్వహిచారు. కార్యక్రమంలో నాలుగోటౌన్​ ఎస్సై సందీప్​, కాకతీయ విద్యాసంస్థల చైర్​పర్సన్​ సీహెచ్ విజయలక్ష్మి, కాకతీయ డైరెక్టర్ సీహెచ్ రాజా, ప్రిన్సిపాళ్లు నటరాజ్, కేవోఎస్ అకాడమీక్ కో–ఆర్డినేటర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Pre Primary Graduation Day

Pre Primary Graduation Day

ఇది కూడా చదవండి..: Olympiad Education Benefits | ఒలంపియాడ్‌ విద్యతో ఉజ్వల భవిష్యత్తు..

Sita Rama Kalyanam in Yellareddy | సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి
Kamareddy festival security | పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి
Congress Six Guarantees | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి
TAGGED:Graduation Day CelebrationHolistic EducationInduru NewsKakatiya Olympiad SchoolPre Primary Graduation DaySchool Event IndiaSchool ProgramsStudent Activities
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bodhan Municipal Budget | Bodhan Municipal Budget | బోధన్​ మున్సిపల్​ బడ్జెట్​ రూ.49.06 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్​
Next Article Iran warning employees Iran warning employees | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయా.. అమెరికన్ కంపెనీల ఉద్యోగులకు ఇరాన్ హెచ్చరిక!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?