Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Pregnancy Travel Tips | ప్రెగ్నెన్సీలో ప్రయాణాలా.. భయం వద్దు.. ఈ ‘గోల్డెన్ రూల్స్’ పాటిస్తే చాలు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Pregnancy Travel Tips | ప్రెగ్నెన్సీలో ప్రయాణాలా.. భయం వద్దు.. ఈ ‘గోల్డెన్ రూల్స్’ పాటిస్తే చాలు!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Pregnancy Travel Tips | ప్రెగ్నెన్సీలో ప్రయాణాలా.. భయం వద్దు.. ఈ ‘గోల్డెన్ రూల్స్’ పాటిస్తే చాలు!

ప్రతి అడుగులోనూ అప్రమత్తంగా ఉంటూ, వైద్యుల పర్యవేక్షణలో ప్రయాణాలు సాగించడం కాబోయే అమ్మలకు, పుట్టబోయే బిడ్డకు ఎంతో శ్రేయస్కరం.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 3, 2026 9:44 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
Pregnancy Travel Tips
Pregnancy Travel Tips

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pregnancy Travel Tips | ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణాలు చేయవచ్చా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వైద్యుల సలహా తీసుకుంటూ.. తగిన జాగ్రత్తలు పాటిస్తే గర్భిణులు సురక్షితంగా ప్రయాణించవచ్చు. అయితే, ప్రయాణ సమయాల్లో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే నిపుణుల సూచనలు పాటించడం అవసరం.

Contents
  • Pregnancy Travel Tips | ఆహారం , దుస్తుల ఎంపిక:
    • Pregnancy Travel Tips | హైడ్రేషన్ , మెడికల్ కిట్:
      • పరిశుభ్రత ముఖ్యం:
      • ఎవరు ప్రయాణించకూడదు?
      • ముందస్తు జాగ్రత్తలు:

Pregnancy Travel Tips | ఆహారం , దుస్తుల ఎంపిక:

గర్భధారణ సమయంలో వాంతులు, వికారం వంటి సమస్యలు సహజం. అందుకే ప్రయాణానికి ముందు, ప్రయాణంలో తేలికగా జీర్ణమయ్యే పోషకాహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. బిగుతుగా ఉండే దుస్తుల కంటే వదులుగా, సౌకర్యవంతంగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం. నడవడానికి వీలుగా ఉండే ఫ్లాట్ చెప్పులను ఎంచుకోవడం వల్ల అలసట తగ్గుతుంది.

Pregnancy Travel Tips | హైడ్రేషన్ , మెడికల్ కిట్:

శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడానికి వాటర్ బాటిల్‌ను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే, ప్రెగ్నెన్సీ రిపోర్టులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు, అవసరమైన మందులను ఒక బ్యాగ్‌లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఇవి వెంటనే ఉపయోగపడతాయి.

పరిశుభ్రత ముఖ్యం:

ప్రయాణాల్లో పబ్లిక్ వాష్‌రూమ్స్ వాడేటప్పుడు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. అందుకే హ్యాండ్‌వాష్ లేదా శానిటైజర్ వెంట ఉంచుకోవడం మర్చిపోవద్దు. చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు.

ఎవరు ప్రయాణించకూడదు?

విమాన ప్రయాణాలు: 35 వారాలు దాటిన వారు, జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నవారు లేదా కవల పిల్లలు ఉన్నవారు విమాన ప్రయాణాలకు దూరంగా ఉండాలి. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం (Pre-mature delivery) అయ్యే రిస్క్ ఉంటుంది.

కారు ప్రయాణం: కారులో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. మధ్యమధ్యలో వాహనాన్ని ఆపి కాసేపు అటూ ఇటూ నడవడం వల్ల రక్త ప్రసరణ బాగుంటుంది.

ముందస్తు జాగ్రత్తలు:

గతంలో గర్భస్రావం జరిగిన వారు, గర్భాశయ సంబంధిత సమస్యలు ఉన్నవారు, తొలి నెలల్లో బ్లీడింగ్ సమస్య ఎదుర్కొన్న వారు, ఎక్కువ వయసులో గర్భం దాల్చిన వారు ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Everest Insurance Scam | 30 వేల అడుగుల ఎత్తులో పర్వతారోహకుల ప్రాణాలతో చెలగాటం.. నేపాల్​లో ట్రెక్కింగ్​ ఇన్సూరెన్స్​ కుంభకోణం!

ఇది కూడా చదవండి: Oracle layoffs news | Oracleలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు.. ఉదయం నుంచే లేఆఫ్ ఈ మెయిల్స్!

Parabhava Year Horoscope | పంచాంగ శ్రవణం ఆలకిద్దామా.. శ్రీ పరాభవ నామ సంవత్సర అదృష్ట రాశులు ఇవే!
Cooler Smell Problem | కూలర్ నుంచి దుర్వాసన వస్తోందా.. ఈ చిన్న తప్పులే కారణం!
Rohit Reddy Drugs Case | మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కేసీఆర్​ ఆగ్రహం.. షోకాజ్​ నోటీసులు జారీ
Joint Tax Filing | దంపతుల కోసం జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తేవాలి.. రాజ్యసభలో రాఘవ్ చద్దా!
LB Nagar Car Accident | ఎల్​బీ నగర్​లో కారు దగ్ధం.. అతివేగంతో ప్రమాదం
TAGGED:Pregnancy Travel Tips
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article PAN Card Rules PAN Card Rules | పాన్ కార్డ్ రూల్స్ మారాయ్.. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు..
Next Article Peacock Snake Venom | నెమలికి పాము విషం ఎందుకు ఎక్కదో తెలుసా.. దాని శరీరంలో ఉండే రహస్యం ఇదే! Peacock Snake Venom | నెమలికి పాము విషం ఎందుకు ఎక్కదో తెలుసా.. దాని శరీరంలో ఉండే రహస్యం ఇదే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?