అక్షరటుడే, వెబ్డెస్క్ : President protocol controversy | పశ్చిమ బెంగాల్ (west bengal)లో రాష్ట్రపతి ప్రొటోకాల్ వివాదంపై (President protocol controversy) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. రాష్ట్రపతి పర్యటన సమయంలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు.
ఉత్తర బెంగాల్‌లో అంతర్జాతీయ సంతల్ సదస్సు (Santal Conference)లో పాల్గొనడానికి రాష్ట్రపతి ముర్ము శనివారం బెంగాల్ వెళ్లారు. అయితే రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు అవుతున్న సదస్సుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అంతేగాకుండా రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి సీఎం, మంత్రులు అధికారికంగా స్వాగతం పలకడానికి రాలేదు. దీనిపై ముర్ము అసహనం వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా మోదీ స్పందించారు.
President protocol controversy | వేదికను ఎందుకు మార్చారు
అంతర్జాతీయ సంతల్ సదస్సు వేదికను మార్చినందుకు తృణమూల్ కాంగ్రెస్‌ను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము విమర్శించిన కొన్ని గంటల తర్వాత ప్రధానమంత్రి మోదీ ఆ పార్టీని తీవ్రంగా విమర్శించారు. బెంగాల్ ప్రభుత్వం అన్ని లిమిట్స్ క్రాస్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతాల్ సంస్కృతిని మమత అవమానించారని మండిపడ్డారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకన్నా ఉన్నతమైనదని, ఆ పదవిని గౌరవించాలన్నారు.
మోదీ వ్యాఖ్యలకు బెంగాల్ సీఎం మమత (CM Mamatha Benarji) కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రపతిని అడ్డంపెట్టుకుని.. బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయాలు సరికాదన్నారు.
This is shameful and unprecedented. Everyone who believes in democracy and the empowerment of tribal communities is disheartened.
The pain and anguish expressed by Rashtrapati Ji, who herself hails from a tribal community, has caused immense sadness in the minds of the people… https://t.co/XGzwMCMFrT
— Narendra Modi (@narendramodi) March 7, 2026

