అక్షరటుడే, వెబ్డెస్క్: Eyes | నేటి డిజిటల్ యుగంలో, చిన్నపిల్లలు కంటి సమస్యలతో బాధపడటానికి ప్రధాన కారణం. స్క్రీన్లకు బానిసలు కావడం. వీటితో పాటు, సరిగా పోషకాహారం అందకపోవడం, గంటల తరబడి తక్కువ వెలుతురులో ఉండటం కూడా దృష్టి సమస్యలను (vision problems) పెంచుతున్నాయి.
వంశపారంపర్య కారణాలు లేదా గాయాల వల్ల కూడా కళ్ళజోడు అవసరం కావచ్చు. మన పిల్లల కళ్ళను (children eyes) కాపాడుకోవడానికి, దృష్టి లోపాలు రాకుండా నివారించడానికి తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలు.
Eyes | చిన్న వయసులో కంటి సమస్యలకు కారణాలు:
పోషకాహార లోపం: కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు (ముఖ్యంగా క్యారెట్, బీట్రూట్ (carrots and beetroot) వంటివి) ఆహారంలో లేకపోవడం. చీకటిగా లేదా మసక వెలుతురులో ఎక్కువసేపు ఉండటం. అలాగే, సూర్యరశ్మికి తగినంతగా తీసుకోలేక పోవడం(రోజుకు కనీసం 1 గంట ఆరుబయట ఉండాలి).
డిజిటల్ వ్యసనం: టీవీలు, మొబైల్స్, ల్యాప్టాప్ల వంటి స్క్రీన్లకు ఎక్కువ సమయం కేటాయించడం. తల్లిదండ్రులు తిండి పెట్టడానికి మొబైల్ ఇవ్వడం ప్రధాన సమస్య. జన్యుపరంగా తల్లిదండ్రులకు కంటి సమస్యలు ఉంటే, అవి పిల్లలకు సంక్రమించవచ్చు.
కళ్ళజోడు రాకుండా తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు: పోషకాహారంపై శ్రద్ధ: పిల్లల ఆహారంలో కళ్ళకు మేలు చేసే క్యారెట్, బీట్రూట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండేలా చూడాలి. పెరుగుదల దశలో సరైన పోషక విలువలు అందేలా జాగ్రత్త పడాలి.
స్క్రీన్ నియంత్రణ: మొబైల్, టీవీ వ్యసనాన్ని (mobile and TV addiction) పూర్తిగా నిషేధించలేకపోయినా, వీలైనంతవరకు నియంత్రించాలి. బొమ్మలు, పుస్తకాలు లేదా ఆటలతో దృష్టి మళ్లించాలి. టీవీ చూసేటప్పుడు కనీసం 6-8 అడుగుల దూరం పాటించాలి.స్క్రీన్ వెలుతురు(Brightness) మరీ ఎక్కువగా, మరీ తక్కువగా కాకుండా తగినంత స్థాయిలో ఉండేలా సెట్ చేయాలి.
Eyes | కాంతి ప్రసరణ:
- చదువుకునేటప్పుడు సరిపడా కాంతి ఉండేలా చూసుకోవాలి.
- గదిలో లైట్ వేయకుండా టీవీ/మొబైల్ చూడటం మంచిది కాదు.
- అధిక కాంతిని చిమ్మేవాటిని (సూర్యగ్రహణం వంటివి) నేరుగా చూడకుండా జాగ్రత్త పడాలి.
Eyes | ముందస్తు గుర్తింపు:
పిల్లలు తరచూ కళ్ళు నలపడం, కళ్ళు ఎర్రబడటం లేదా కళ్ల నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. పిల్లల కళ్ళ ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తూ, పైన చెప్పిన జాగ్రత్తలను తప్పక పాటించడం ద్వారా వారి దృష్టిని దీర్ఘకాలం కాపాడుకోవచ్చు.


