Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: PSL Ball Tampering | పీఎస్ఎల్ 2026లో బాల్ ట్యాంపరింగ్ కలకలం.. వీడియోలో అడ్డంగా దొరికిన స్టార్ ప్లేయ‌ర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - PSL Ball Tampering | పీఎస్ఎల్ 2026లో బాల్ ట్యాంపరింగ్ కలకలం.. వీడియోలో అడ్డంగా దొరికిన స్టార్ ప్లేయ‌ర్

క్రీడలు

PSL Ball Tampering | పీఎస్ఎల్ 2026లో బాల్ ట్యాంపరింగ్ కలకలం.. వీడియోలో అడ్డంగా దొరికిన స్టార్ ప్లేయ‌ర్

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో మరో వివాదం చోటుచేసుకుంది. లాహోర్ ఖలందర్స్ ఆటగాడు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అంపైర్లు గుర్తించడంతో 5 పరుగుల పెనాల్టీ విధించగా, కరాచీ కింగ్స్ మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 10:26 ఉద.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
PSL Ball Tampering

అక్షరటుడే, వెబ్​డెస్క్ :  PSL Ball Tampering | పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 (Pakistan Super League 2026) సీజన్ మరోసారి వివాదాలతో వార్తల్లో నిలిచింది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ ఘటన బయటపడటం సంచలనంగా మారింది. లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అంపైర్లు మ్యాచ్ మధ్యలోనే ఈ ట్యాపరింగ్ క‌లక‌లాన్ని గుర్తించారు.

Contents
  • PSL Ball Tampering | బాల్ ట్యాంపరింగ్ ఎలా బయటపడింది?
    •  PSL Ball Tampering | మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో విచారణ

మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ (Lahore Qalandars) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫిక్ (33), హసీబుల్లా ఖాన్ (28) రాణించారు. కరాచీ బౌలర్లలో మొయిన్ అలీ, ఆడమ్ జంపా, మీర్ హంజా తలో రెండు వికెట్లు తీశారు. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్, చివరి ఓవర్ల వరకు పోరాడింది. 19 ఓవర్లకు 115/5 స్కోరుతో నిలిచిన జట్టు, చివరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉంది.

PSL Ball Tampering | బాల్ ట్యాంపరింగ్ ఎలా బయటపడింది?

చివరి ఓవర్ వేయడానికి హరీస్ రవూఫ్ సిద్ధమవుతుండగా, కెప్టెన్ షాహీన్ అఫ్రిది సూచనలు ఇస్తున్నారు. ఈ సమయంలో సీనియర్ ఆటగాడు ఫఖర్ జమాన్ (Fakhar Zaman) బంతిని తీసుకుని తన గోళ్లతో దాని ఉపరితలాన్ని మార్చే ప్రయత్నం చేశాడు.దీనిని గమనించిన అంపైర్లు వెంటనే బంతిని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా బంతిని మార్చినట్లు నిర్ధారించిన అనంతరం, బంతిని మార్చడమే కాకుండా కరాచీ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ జోడించారు. ఈ పెనాల్టీతో కరాచీ విజయ లక్ష్యం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. చివరకు 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి కరాచీ కింగ్స్ విజయం సాధించింది.

 PSL Ball Tampering | మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో విచారణ

ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) స్పందిస్తూ, మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో విచారణ జరుగుతోందని తెలిపింది. ఫఖర్ జమాన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించినట్లు వెల్లడించింది. రాబోయే 48 గంటల్లో పూర్తి విచారణ అనంతరం తుది నిర్ణయం వెలువడనుంది. ఆరోపణలు నిజమని తేలితే ఫఖర్ జమాన్‌పై మ్యాచ్ నిషేధం సహా కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే వివాదాలతో సతమతమవుతున్న పీఎస్ఎల్‌కు ఈ ఘటన మరో పెద్ద దెబ్బగా మారింది. లీగ్ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Virat Kohli innings | దుమ్మురేపిన ఆర్సీబీ .. కోహ్లీ సునామీ ఇన్నింగ్స్‌తో 202 టార్గెట్ సునాయాసంగా ఛేజ్

Pakistan Semifinal Chances | ఇంగ్లండ్ విజ‌యంతో మారిన లెక్క‌లు.. పాకిస్తాన్ సెమీస్‌కి చేరాలంటే..!
RCB Sale Deal | ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద డీల్.. భారీ ధరకు దక్కించుకున్న బిర్లా-టైమ్స్‌‌‌‌ గ్రూప్
West Indies Team Travel | యుద్ధం వ‌ల‌న‌ భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్ జట్టుకి గుడ్ న్యూస్.. తొమ్మిది రోజుల తర్వాత స్వదేశానికి ప్రయాణం
India vs England Semi | ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం.. చివరి వరకు పోరాడి ఓడిన ఇంగ్లండ్​.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!
Saketh Myneni Deputy Collector | టెన్నిస్ స్టార్‌కి డిప్యూటీ కలెక్టర్ పదవి.. క్రికెటర్ శ్రీచరణికి నజరానా
TAGGED:Fakhar ZamanLahore QalandarsPakistan Cricket BoardPakistan Super League 2026PSL Ball Tampering
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Rain Forecast Telangana Rain Forecast | పలు జిల్లాలకు వర్ష సూచన..
Next Article AI Toll Collection AI Toll Collection | ఏఐతో సర్కారుకు కాసుల పంట.. నాలుగింతలు కానున్న టోల్ వసూళ్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?