అక్షరటుడే, బోధన్ : Public Participation Development | పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని 26, 35వ వార్డుల్లో నిర్వహించిన వార్డు సభల్లో ఆమె పాల్గొన్నారు.
Public Participation Development | ఫిర్యాదుల స్వీకరణ..
తమ సమస్యలను ప్రజలు రాతపూర్వకంగా తెలియజేసేందుకు వీలుగా గ్రామ సభ వేదిక వద్ద ఫిర్యాదుల బాక్సును అందుబాటులో ఉంచారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను గ్రామ సభలో ఒక్కో పథకం వారీగా అధికారులు పేర్లను ప్రకటించారు. పంట రుణాల మాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme), గృహ జ్యోతి, చేయూత పథకం, కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, సన్నధాన్యానికి బోనస్ చెల్లింపు తదితర వాటి ద్వారా గ్రామంలో లబ్ది పొందిన వారి వివరాలు చదివి వినిపించారు. పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల తమకు చేకూరిన ప్రయోజనాల గురించి గ్రామసభలో తమ అనుభవాలను తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Public Participation Development | 26వ వార్డులో..
26వ వార్డులో రేఖమ్మ అనే మహిళ భర్త ఇటీవలే మృతి చెందగా, ఆమెకు రెండు పడక గదుల ఇళ్ల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని విడనాడాలని, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చెత్త సేకరణ కోసం ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనాల సిబ్బందికి తడి-పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా వార్డుల అభివృద్ధిపై స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. వార్డు సభలలో బోధన్ మున్సిపల్ ఛైర్పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి, కమిషనర్ జాదవ్ కృష్ణ, కార్పోరేటర్ దామోదర్, ఏసీపీ శ్రీనివాస్, ట్రాన్స్కో ఏడీఈ ముఖ్తార్, వివిధ శాఖల అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Toddy Depot Permission | రెండో కల్లు డిపోను కొనసాగించేలా అనుమతి ఇవ్వండి..
