అక్షరటుడే, ఇందూరు: Public Representatives Training | తమకు సేవ చేస్తారని ఎంతో నమ్మకంతో ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవ చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi Collector) హితవు పలికారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో (Nizamabad Local Governance) భాగంగా నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లకు గురువారం బోర్గాం(పి)లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో శిక్షణ కార్యక్రమం (Telangana Public Administration) నిర్వహించారు. అదే విధంగా అమృతా గార్డెన్స్‌లో సర్పంచ్‌లకు అవగాహన సదస్సు జరిగింది.
Public Representatives Training | విధులు, బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ..
ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అధికారాలు, విధులు, బాధ్యతల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ, ప్రింటెడ్ మెటీరియల్‌ను ప్రజాప్రతినిధులకు (Municipal Leaders Training) అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. హక్కులు, అధికారాలతో పాటు బాధ్యతలను సైతం సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన స్థానిక సంస్థల సభ్యులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
Public Representatives Training | సేవ చేయాలనే సంకల్పం ఉండాలి
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే ప్రగాఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో (Local Government Development) అందరిని భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చొరవ చూపాలన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో (Panchayat Representatives) సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఉందని సూచించారు. సదస్సులలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీపీవో శ్రీనివాస్ రావు, డీఆర్డీవో సాయాగౌడ్, డీఈవో అశోక్, ఏవో రాజబాబు, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Minor Child Labour | కళాశాలలో మైనర్ పనిచేస్తుండడంపై కలెక్టర్ ఆగ్రహం.. ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసులు

