అక్షరటుడే, హైదరాబాద్: Putta Mahesh | మొయినాబాద్ ఫామ్‌హౌస్ పార్టీలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ Putta Mahesh Kumar Yadav తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ తాజాగా వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాతోపాటు మీడియాలో వస్తున్న కథనాలను నమ్మొద్దని ప్రజలను కోరారు.
Putta Mahesh | డిన్నర్‌కు మాత్రమే వెళ్లాను
ఒక వీడియో సందేశంలో పుట్టా మహేష్ మాట్లాడారు.. తనను కలవాలని పలువురు ఆహ్వానించడంతోనే తాను డిన్నర్‌కు వెళ్లినట్లు తెలిపారు. తాను ఎలాంటి డ్రగ్స్ పార్టీకి వెళ్లలేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఏలూరు ప్రజలు తనపై ఉంచుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరిస్తానని, అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Putta Mahesh | సీఎం సీరియస్
ఇక తాజా ఘటనపై తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది. డ్రగ్స్ వంటి ఘటనలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నాయకుల తప్పులు, బలహీనతల వల్ల తమ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితిని ఎప్పటికీ రానివ్వబోమని సీఎం పేర్కొన్నట్లు సమాచారం.
దూరంగా ఉండాలని ఆదేశం
డ్రగ్స్ పార్టీ ఘటన నేపథ్యంలో పుట్టా మహేష్‌ను పార్టీ కార్యక్రమాలకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు Palla Srinivasa Raoను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనికితోడు మహేష్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరాలని ఆదేశించినట్లు కూడా సమాచారం.
ఇది కూడా చదవండి: Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రిమాండ్!

