Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: PV Sindhu Returns | భారత్​కు చేరుకున్న పీవీ సింధు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - PV Sindhu Returns | భారత్​కు చేరుకున్న పీవీ సింధు

క్రీడలుజాతీయం

PV Sindhu Returns | భారత్​కు చేరుకున్న పీవీ సింధు

దుబాయిలో చిక్కుకున్న బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధు భారత్​ చేరుకున్నారు. తాను క్షేమంగా వచ్చినట్లు ట్వీట్​ చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 3, 2026 1:02 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
PV Sindhu Returns
PV Sindhu Returns

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PV Sindhu Returns | భారత స్టార్​ బ్యాడ్మింటన్​ ప్లేయర్​ పీవీ సింధు భారత్​కు చేరుకున్నారు. దుబాయిలో చిక్కుకున్న ఆమె మంగళవారం ఉదయం బెంగళూరుకు వచ్చారు.

Contents
  • PV Sindhu Returns | విమానాలు ప్రారంభం
    • PV Sindhu Returns | భారతీయుల తరలింపు
      • PV Sindhu Returns | కేంద్రం చర్యలు

గల్ఫ్​ దేశాలపై ఇరాన్​ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దుబాయి ఎయిర్​పోర్టుపై కూడా దాడి జరిగింది. దీంతో అధికారులు ఎయిర్​పోర్టును మూసివేశారు. అయితే దుబాయి నుంచి పలు దేశాలకు వెళ్లాల్సిన వారు అక్కడే చిక్కుకుపోయారు. పీవీ సింధు సైతం దుబాయి ఎయిర్​పోర్టు (Dubai Airport)లో స్టక్​ అయ్యారు. ఈ క్రమంలో తమకు సమీపంలో బాంబు పేలుడు చోటు చేసుకుందని, భయంతో పరుగులు తీసినట్లు ఆమె రెండు రోజుల క్రితం సోషల్​ మీడియాలో పోస్ట్ పెట్టారు. అనంతరం అధికారులు ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

PV Sindhu Returns | విమానాలు ప్రారంభం

దుబాయి నుంచి మంగళవారం ఉదయం విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. దీంతో పీవీ సింధు (PV Sindhu) ఇండియాకు చేరుకున్నారు. సురక్షితంగా వచ్చానని ట్వీట్ చేశారు. తొలుత విశ్రాంతి తీసుకుని తర్వాత భవిష్యత్తు ప్లాన్స్​పై దృష్టి పెడతామన్న పేర్కొన్నారు. తనకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో సహకరించిన దుబాయి అధికారులు, ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

PV Sindhu Returns | భారతీయుల తరలింపు

UAE నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ మొదలైంది. అక్కడ చిక్కుకున్న వారిని విమానాల్లో ఇండియా (India)కు తీసుకు వస్తున్నాయి. అబుదాబి నుంచి ఎతిహాద్ ఎయిర్ లైన్స్ ఢిల్లీకి చేరింది. ఇందులో 300 మంది భారతీయుల వచ్చారు. ఇప్పటి వరకు నాలుగు విమానాలు భారతీయులను తీసుకొచ్చాయి. మూడు రోజుల విరామం తర్వాత విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో చాలా మంది భారత్​ రావడానికి యత్నిస్తున్నారు.

PV Sindhu Returns
PV Sindhu Returns

PV Sindhu Returns | కేంద్రం చర్యలు

గల్ఫ్​లో చిక్కుకున్న ఇండియన్స్ కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జెడ్డా నుంచి మంగళవారం 10 ప్రత్యేక విమానాలను ఇండిగో (Indigo) నడపనుంది. UAEలో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు పుజైరా నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చికి 4 స్పెషల్ స్పైస్ జెట్ ఫ్లైట్స్ రానున్నాయి.

ఇది కూడా చదవండి..: RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

India War Challenges | యుద్ధంతో భారత్​కు సవాళ్లు.. గ్యాస్​, పెట్రోల్​పై మోదీ కీలక ప్రకటన
Karnataka Politics | కర్ణాటకలో మరోసారి పొలిటికల్‌ ట్విస్ట్​.. సీఎం మార్పు తప్పదా!
Fuel Shortage India | ఇంధన యుద్ధం.. దేశంలో పెట్రోల్​–డీజిల్​ కొరత.. బంకుల్లో వాహనదారుల బారులు!
Ambulance Miracle Incident | అంబులెన్స్​లో బ్రెయిన్​ డెడ్​ మహిళ.. తిరిగి ప్రాణం పోసిన పెద్ద కుదుపు!
India Gas Shortage | గ్యాస్​ కొరత అధిగమించడానికి కేంద్రం కీలక చర్యలు
TAGGED:Dubai AirportDubai Airport IncidentEtihad AirwaysIndiaIndian Badminton StarIndian EvacuationIndigoIran attacksPV SindhuPV Sindhu ReturnsSpiceJet Special FlightsUAE Flights Resume
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article IQOO 15R 5G IQOO 15R 5G | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో ఐక్యూ ఫోన్.. ఆ కార్డులతో రూ. 4 వేల వరకు తగ్గింపు
Next Article Modi YouTube Subscribers Modi YouTube Subscribers | సోషల్ మీడియాలో మోదీ హవా.. 3 కోట్లు దాటిన యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?