Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Qatar Iran Missile | ఖతార్​పై ఇరాన్​ క్షిపణి దాడి.. భయంతో ప్రజల పరుగులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Qatar Iran Missile | ఖతార్​పై ఇరాన్​ క్షిపణి దాడి.. భయంతో ప్రజల పరుగులు

అంతర్జాతీయం

Qatar Iran Missile | ఖతార్​పై ఇరాన్​ క్షిపణి దాడి.. భయంతో ప్రజల పరుగులు

ఖతార్​ రాజధాని దోహాలో ఇరాన్​ మిసైళ్లు పడింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 28, 2026 8:56 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Qatar Iran Missile

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Qatar Iran Missile | మిడిల్​ ఈస్ట్ (Middle East) రగిలిపోతుంది. సైరన్​లో మోత.. బాంబుల పేలుళ్లతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణం ఎక్కడ మిసైల్ పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Contents
  • Qatar Iran Missile | దోహాలో..
    • Qatar Iran Missile | ఖమేనీ సేఫ్​
      • స్వదేశానికి తీసుకెళ్లండి

తమపై ఇజ్రాయెల్​ (Israel), అమెరికా దాడి చేయడంతో ఇరాన్​ (Iran) ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్​తో పాటు గల్ఫ్​ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై మిసైళ్లను ప్రయోగించింది. పలు క్షిపణులను ఆయా దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు మధ్యలో అడ్డుకుంటున్నాయి. కొన్ని మిసైళ్లు మాత్రం జనావాసాలపై పడుతున్నాయి. తాజాగా ఖతార్​లో ఓ మిసైల్​ పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Qatar Iran Missile | దోహాలో..

ఖతార్​ రాజధాని దోహా (Doha)లో మిసైల్​ పడింది. ఆకాశం నుంచి క్షిపణి దూసుకు వస్తుండటం చూసి ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆ క్షిపణి రోడ్డుపై పడింది. దీంతో పెద్ద ఎత్తున పేలుడు చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం గురించి వివరాలు తెలియరాలేదు. మరోమైపు దుబాయ్​లో సైతం మూడు భారీ పేలుళ్లు చోటు చేసుకున్నట్లు పలు వార్త సంస్థలు పేర్కొన్నాయి.

missile

Qatar Iran Missile | ఖమేనీ సేఫ్​

ఇజ్రాయెలల్ దాడుల్లో సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయాడంటూ ఆ దేశ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తమ సుప్రీం లీడర్‌ సురక్షితంగా ఉన్నారని ఇరాన్‌ ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇరాన్‌ అధ్యక్షుడితోపాటు ఉన్నతాధికారులంతా సురక్షితమని ప్రకటించారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ నివాసం నేలమట్టం అయిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఆయనను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.

స్వదేశానికి తీసుకెళ్లండి

పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య టెహ్రాన్‌లోని ఒక భారతీయ విద్యార్థిని తమను తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని కోరింది. టెహ్రాన్​లో ఉన్న ఓ విద్యార్థిని సోషల్​ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. టెహ్రాన్​లో పరిస్థితి దారుణంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని పేర్కొంది. వీలైనంత త్వరగా తమను ఇండియాకు తీసుకు వెళ్లాలని ఆమె కోరింది. దయచేసి పరిస్థితి మరింత దిగజారే వరకు వేచి ఉండకండి అని అభ్యర్థించింది.

ఇది కూడా చదవండి : Dubai Iran Attacks | దుబాయ్​పై ఇరాన్​ దాడులు.. బుర్జ్​ ఖలీఫా ఖాళీ

JUST IN: 🇶🇦🇮🇷 Footage shows intercepted Iranian ballistic missile crashing and exploding into a residential area in Qatar. pic.twitter.com/aye5QD04dG

— BRICS News (@BRICSinfo) February 28, 2026

Anjali Sardana Startup | ఏడాదిలోనే రూ.800 కోట్ల టర్నోవర్​.. స్టార్టప్​తో యువతి విజయం
KA Paul Iran Israel War | వారంలో యుద్ధం ముగుస్తుంది : కేఏ పాల్
Mojtaba Khamenei Iran | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు
Middle East Oil Crisis | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇంధన ధరల పెంపుపై కేంద్రం స్పష్టత..
Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్​ దాడి.. విమానాలు రద్దు
TAGGED:Air defense systemsDoha explosionGulf tensionsIndian students in IranIran missile attackIsrael Iran warMiddle East conflictQatar news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Judicial Eleven victory | Judicial Eleven victory | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో జ్యూడీషియల్ ఎలెవన్​ టీం ఘనవిజయం
Next Article Telangana Tirumala Brahmotsavam | Telangana Tirumala Brahmotsavam | తెలంగాణ తిరుమల దేవస్థానంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?