అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Qatar oil price warning | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ (Iran) ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత మోగుతోంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ మూసివేయడంత పాటు యుద్ధ భయాలతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఖతార్ సంచాలన వ్యాఖ్యలు చేసింది.
యుద్ధం మరో రెండు వారాలు కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లు అవుతుందని ఖతార్ (Qatar) పేర్కొంది. అలా అయితే ప్రపంచ దేశాలకు పెనుసంక్షోభం తప్పదని హెచ్చరించింది. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కూల్చివేసే సామర్థ్యం గల కొత్త ఇంధన సంక్షోభానికి దారితీయవచ్చని ఖతార్ మంత్రి పేర్కొన్నారు.
Qatar oil price warning | 150 డాలర్లకు..
గల్ఫ్ ఇంధన మంత్రి సాద్ అల్-కాబీ చమురు బ్యారెల్ ధర రెట్టింపు అయి 150 డాలర్లు దాటే అవకాశం ఉందన్నారు. చమురు ప్రస్తుతం బ్యారెల్‌కు దాదాపు 85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చుతుంది కాబీ అన్నారు.
Qatar oil price warning | జీడీపీపై ప్రభావం
చాలా దేశాలు గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటాయి. అయితే ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. ఆయిల్ ట్యాంకర్లు, రిపైనరీలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగిస్తోంది. దీంతో ఆయా దేశాలు ముడి చమురు ఉత్పత్తి తగ్గించాయి. దీంతో రేట్లు పెరిగే అవకాశం ఉంది. చమురు రేట్లు పెరిగితే ఆ ప్రభావం అన్ని రంగాలపై ఉండనుంది. ద్రవ్యోల్బణం సైతం పెరిగి, జీడీపీపై తీవ్ర ప్రభావం పడనుంది. యుద్ధం త్వరలో ముగిసినప్పటికీ, ముడి చమురు ఉత్పత్తి సాధారణ స్థితికి రావడానికి వారాలు, నెలలు పట్టే అవకాశం ఉందని మంత్రి కాబీ పేర్కొన్నారు.

