అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Raghunath Temple | శ్రీరామనవమి (Sriram Navami) వేడులు జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు రామనామస్మరణతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. భక్తులు ఈ మహోత్సవాలను తిలకించేందుకు ఆలయాలకు పోటెత్తుతున్నారు.
Raghunath Temple | రఘునాథ ఆలయంలో..
నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో పీసీసీ చీఫ్ (PCC Chief) బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ దంపతులు, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) దంపతులు, మేయర్ ఉమారాణి, రమేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదపండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
Raghunath Temple | ఆలయ కమిటీ ఏర్పాట్లు
కల్యాణోత్సవం సందర్భంగా ఖిల్లా రామాలయానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎండల కారణంగా ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా షామియానాలు వేయించారు. తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. కల్యాణ మహోత్సవంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి: Kavitha Sri Ram Navami | నిజామాబాద్ ఖిల్లా రామాలయంలో కవిత ప్రత్యేక పూజలు

