Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Raj Gopal Reddy Dinner | కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Raj Gopal Reddy Dinner | కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!

తెలంగాణతాజా వార్తలు

Raj Gopal Reddy Dinner | కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!

ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు వేడెక్కిన పరిస్థితిలో ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి రహస్య సమావేశం మరిన్ని రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా తీసుకుంటుంది..? కాంగ్రెస్​ పార్టీ అంతర్గత పరిస్థితులను ఎలా సమతుల్యం చేస్తుంది? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.

Naresh chandan
Last updated: మార్చి 16, 2026 10:01 ఉద.
Naresh chandan
2 వారాలు ago
Share
Raj Gopal Reddy Dinner | కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!
Raj Gopal Reddy Dinner | కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!

అక్షరటుడే, హైదరాబాద్: Raj Gopal Reddy Dinner | తెలంగాణ కాంగ్రెస్ లో తాజా రాజకీయ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్​ రెడ్డి Komatireddy Raj Gopal Reddy నిర్వహించినట్లు చెబుతున్న రహస్య డిన్నర్ మీటింగ్ అంశం కాంగ్రెస్​ అంతర్గత రాజకీయాలను మరింత వేడెక్కించినట్లు తెలుస్తోంది.  ఈ అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Contents
  • Raj Gopal Reddy Dinner | రహస్యంగా డిన్నర్ మీటింగ్
    • Raj Gopal Reddy Dinner | మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తి?
      • కాంగ్రెస్‌లో కలకలం
      • బీఆర్‌ఎస్ వైపు మొగ్గు?
      • రాజకీయ సమీకరణాలు..

Raj Gopal Reddy Dinner | రహస్యంగా డిన్నర్ మీటింగ్

దాదాపు 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజగోపాల్​  రెడ్డి ఈ డిన్నర్ మీటింగ్‌కు ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది. కానీ, గురువారం సాయంత్రం వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే రహస్యంగా ఈ మీటింగ్​కు హాజరైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ మీటింగ్​ ఎక్కడ జరిగింది ? ఏ అంశాలపై చర్చ జరిగింది ? అనేది మాత్రం వెల్లడికాలేదు.akshara raja

Raj Gopal Reddy Dinner | మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తి?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కనీయలేదని గత కొంతకాలంగా ముఖ్యమంత్రి A. Revanth Reddyపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన భవిష్యత్ రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఈ డిన్నర్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో కలకలం

ఈ సమావేశ అంశం బయటకు పొక్కడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చలు వేడెక్కాయి. ఇప్పటికే కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి Jeevan Reddy పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఈ నెల 25వ తేదీన బీఆర్​ఎస్​లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ షాక్​ నుంచి పార్టీ వర్గాలు తేరుకోకముందే రాజ గోపాల్​ రెడ్డి రహస్య మీటింగ్​ మరోసారి కలకలం రేపింది. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయా.. ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

బీఆర్‌ఎస్ వైపు మొగ్గు?

రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మరో ప్రచారం ప్రకారం.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్​ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ నేతలు.. రాజకీయ సమీకరణాలపై చర్చలు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు.

రాజకీయ సమీకరణాలు..

రహస్య డిన్నర్ సమావేశం కేవలం సాధారణ మీటింగా..? లేక తెలంగాణ రాజకీయాల్లో మార్పులకు నాంది కాబోతుందా..? అన్నదానిపై మరింత ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య అసంతృప్తి పెరుగుతోందా..? లేక భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై చర్చ జరిగిందా..? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Mahindra BE6 Batman Edition | ధర పెరిగినా ‘బ్యాట్‌మాన్’కు తగ్గని డిమాండ్.. ఏడు నిమిషాల్లోనే సోల్డ్ ఔట్!
March 12 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Kavitha Arrest Narsingi | నార్సింగ్​లో ఉద్రిక్తత.. కల్వకుంట కవిత అరెస్టు!
Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
Clay Water Pot | వేసవిలో కొత్త కుండ కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
TAGGED:brs congress speculationcongress mla meetingkomatireddy raj gopal reddyraj gopal reddy dinnerRevanth Reddy governmenttelangana cabinet expansiontelangana congress politicsTelangana political news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట
Next Article Visakhapatnam Firecracker Explosion Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?