Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rajampet Husband Arrested | భార్య ఉరి వేసుకుంటుంటే.. వీడియో తీసిన భర్త
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Rajampet Husband Arrested | భార్య ఉరి వేసుకుంటుంటే.. వీడియో తీసిన భర్త

ఆంధ్రప్రదేశ్​క్రైం

Rajampet Husband Arrested | భార్య ఉరి వేసుకుంటుంటే.. వీడియో తీసిన భర్త

భార్య ఉరి వేసుకుంటుంటే ఆపాల్సిన ఓ భర్త ఆ దృశ్యాన్ని వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 13, 2026 11:22 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Rajampet Husband Arrested

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajampet Husband Arrested |  కడప జిల్లా (Kadapa District) రాజంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుంటే.. ఆపాల్సిన భర్త.. దగ్గరుండి వీడియో తీశాడు. అంతేగాకుండా అలా కాదు… ఇలా ఉరి వేసుకోవాలని ఆమెకు చెప్పాడు.

Contents
  • Rajampet Husband Arrested | కిటీకిలోంచి వీడియో..
    • Rajampet Husband Arrested | నిందితుడి అరెస్ట్​

క్షణికావేశంలో భార్య ఆత్మహత్యకు యత్నిస్తే అడ్డుకోవాల్సిన భర్త.. నవ్వుతూ శాడిజం చూపాడు. రాజంపేట మండలం (Rajampet Mandal) బోయినపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ లోకోపైలెట్​గా పని చేస్తున్నాడు. అతడికి కృష్ణవేణి అనే యువతితో వివాహం అయింది. దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం మరోసారి దంపతులు గొడవ పడ్డారు. దీంతో భార్య కృష్ణవేణి తాను ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది.

Rajampet Husband Arrested | కిటీకిలోంచి వీడియో..

కృష్ణవేణి గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంది. అనంతరం ఉరి వేసుకుంది. అయితే ఆమె ఉరి వేసుకునే సమయంలో భర్త శ్రీనివాస్​ కిటికీలో నుంచి ఆమెను వీడియో తీశాడు. అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నవ్వుతూ వీడియో చిత్రీకరించారు. ఇలా ఉరి వేసుకోవాలంటూ ఆమె సూచనలు చేశాడు సైకో భర్త.

Rajampet Husband Arrested | నిందితుడి అరెస్ట్​

కృష్ణవేణి మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమె ఉరి వేసుకుంటే.. అడ్డుకోకుండా వీడియో తీసిన శ్రీనివాస్​పై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడు శ్రీనివాస్​ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Lokesh Capgemini Meeting | క్యాప్​ జెమినీ సీఈవోతో ఏపీ మంత్రి లోకేష్​ భేటీ

Nizamabad Drunk Driving | పకడ్బందీగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. రెండు వారాల్లోనే 246 కేసుల నమోదు
Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్​ నేరగాళ్ల టోకరా
Kamareddy Father Remanded | ముగ్గురు కూతుళ్లను హత్యచేసిన తండ్రి రిమాండ్
Medak Road Accident | మెదక్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
Criminal Profile Preparation | ప్రతి నేరస్తుడి ప్రొఫైల్ పక్కాగా సిద్ధం చేయాలి : ఎస్పీ రాజేష్ చంద్ర
TAGGED:Kadapa DistrictRajampet Husband ArrestedRajampet Mandal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article PM Kisan 22nd Installment PM Kisan 22nd Installment | నేడు పీఎం కిసాన్​ నిధుల విడుదల
Next Article Operation Kavach Inspections Operation Kavach Inspections | అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?