అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Rajaram Stadium walkers association | రాజారాం స్టేడియం (Rajaram Stadium) వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. నగర శివారులోని నాగారం స్టేడియం ఆవరణలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది.
Rajaram Stadium walkers association | హోరాహోరీగా ఎన్నికలు..
ఈ ఎన్నికల్లో అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వై.దిగంబర్ ఘన విజయం సాధించారు. అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం బి శ్రీకాంత్, వై దిగంబర్ల మధ్య ఎన్నిక (walkers association) జరిగింది. అసోసియేషన్ మొత్తం ఓట్లలో వై దిగంబర్‌కు 61 ఓట్లు రాగా, బి శ్రీకాంత్‌కు 40 ఓట్లు వచ్చాయి. దీంతో 21 ఓట్ల మెజారిటీతో దిగంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Rajaram Stadium walkers association | ఏకగ్రీవంగా ఎన్నికైన ఇతర సభ్యులు..
మిగితా కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవమయ్యారు. కార్యదర్శిగా ఎన్ సాయిలు, కోశాధికారిగా బాయికాడి వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా కె శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా ఎస్ శ్రీశైలం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వై దిగంబర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గెలిపించిన వాకర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్టేడియం అభివృద్ధికి, (nizamabad news) వాకర్స్ సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గంతో కలిసి కట్టుబడి పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, వాకర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Hydraa Demolitions Ailapur | ఐలాపూర్‌లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు
