Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌

తెలంగాణజాతీయం

Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 3:50 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Rajya Sabha Nomination
Rajya Sabha Nomination

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rajya Sabha Nomination | తెలంగాణ (Telangana) నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. ఈ మేరకు గురువారం ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌, పలువురు మంత్రులు హాజరయ్యారు.

Contents
  • Rajya Sabha Nomination | తెలంగాణ నుంచి రెండో సారి..
    • Rajya Sabha Nomination | చర్చలు, సంప్రదింపుల తర్వాత..
      • Rajya Sabha Nomination | ముఖ్యమంత్రి కోరిక మేరకు..!

Rajya Sabha Nomination | తెలంగాణ నుంచి రెండో సారి..

ఈ సందర్భంగా అభిషేక్‌ సింఘ్వీ (Abhishek Singhvi) మాట్లాడుతూ తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వేం నరేందర్​ రెడ్డి (Vem Narender Reddy) మాట్లాడుతూ రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.

Rajya Sabha Nomination | చర్చలు, సంప్రదింపుల తర్వాత..

Rajya Sabha Nomination
Rajya Sabha Nomination

రాజసభ అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్​ పార్టీ (Congress Party) తీవ్ర కసరత్తు చేసింది. ఒక స్థానానికి ప్రస్తుతం సిటింగ్‌ ఎంపీగా ఉన్న అభిషేక్‌ మను సింఘ్వీ పేరును కాంగ్రెస్‌ ఎంపిక చేయగా.. రెండో స్థానానికి అభ్యర్థి ఎవరనే దానిపై రాత్రి వరకు చర్చలు, సంప్రదింపులు జరిగాయి. చివరకు వేం నరేందర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు.

Rajya Sabha Nomination | ముఖ్యమంత్రి కోరిక మేరకు..!

వేం నరేందర్​రెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కోరినట్లుగా తెలుస్తోంది. అందరితో సన్నిహితంగా ఉండడం.. ఎవరి నుంచి అభ్యంతరాలు రాకపోవడంతో అధిష్ఠానం సీఎం మాటకు ప్రాధాన్యం ఇచ్చి నరేందర్‌రెడ్డి పేరును ఎంపిక చేసింది. అయితే.. ఒకవేళ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని రంగంలోకి దింపినట్లయితే రెండో స్థానానికి పోటీ జరగనుంది. లేకపోతే రెండు స్థానాలను కాంగ్రెస్‌ ఏకగ్రీవంగా దక్కించుకునే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి..: Nagpur Incident | హోలీ రోజు షాకింగ్ ఘటన.. మనవడిపై మరుగుతున్న నీళ్లు కుమ్మరించిన బామ్మ

Hyderabad Timber Depot Fire | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం
Fino Bank CEO Arrest | ఫినో బ్యాంక్​ సీఈవోకు రిమాండ్​
KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్​
Congress Party Positions | కాంగ్రెస్​పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు ఖాయం..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి
Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..
TAGGED:Abhishek SinghviCM Revanth ReddyCongress PartyRajya Sabha NominationTelanganaVem Narender Reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Lakshmi Narasimha Dolotsavam Lakshmi Narasimha Dolotsavam | కనులపండువగా లక్ష్మీనృసింహునికి ఊయల సేవ
Next Article Nizamabad Canal Car Accident | Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?