Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ram Charan Peddhi Teaser | మాస్ అవతార్‌లో రామ్ చరణ్.. బర్త్‌డే టీజర్‌తో అంచనాలు ఆకాశానికి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Ram Charan Peddhi Teaser | మాస్ అవతార్‌లో రామ్ చరణ్.. బర్త్‌డే టీజర్‌తో అంచనాలు ఆకాశానికి!

సినిమా

Ram Charan Peddhi Teaser | మాస్ అవతార్‌లో రామ్ చరణ్.. బర్త్‌డే టీజర్‌తో అంచనాలు ఆకాశానికి!

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘పెద్ది’ టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. కుస్తీ యోధుడిగా చరణ్ మాస్ లుక్ అభిమానులను ఫిదా చేస్తోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 10:30 ఉద.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Ram Charan Peddhi Teaser

అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Ram Charan Peddhi Teaser | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ‘ఉప్పెన’తో దర్శకుడిగా సత్తా చాటిన బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Contents
  • Ram Charan Peddhi Teaser | సినిమాపై హైప్ తెచ్చిన టీజ‌ర్..
    • Ram Charan Peddhi Teaser | ‘పెద్ది’లో మరోసారి అదే స్థాయిలో

సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) సంగీతం అందిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ ట్రెండ్ అవుతున్నాయి. దీంతో ‘పెద్ది’పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Ram Charan Peddhi Teaser | సినిమాపై హైప్ తెచ్చిన టీజ‌ర్..

ఇక రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా విడుదలైన తాజా టీజర్ సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చింది. ఈ వీడియోలో చరణ్ మాస్ అవతార్‌లో అదిరిపోయే లుక్‌లో కనిపించారు. గద పట్టుకుని, కండలు తిరిగిన దేహంతో కుస్తీ యోధుడిగా కనిపించిన తీరు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. “ఆటే నా ప్రాణం” అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ టీజర్ చూస్తే చరణ్ ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించనున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో క్రీడలతో ముడిపడి ఉన్న ఈ కథలో ఆయన పాత్రకు భారీ స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది.

Ram Charan Peddhi Teaser | ‘పెద్ది’లో మరోసారి అదే స్థాయిలో

గతంలో రంగస్థలం సినిమాలో మాస్ లుక్‌లో మెప్పించిన చరణ్, ఇప్పుడు ‘పెద్ది’లో మరోసారి అదే స్థాయిలో అలరించనున్నాడని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ఈ సినిమాతో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. టీజర్‌తోనే భారీ అంచనాలు సృష్టించిన ‘పెద్ది’, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : Vijay Rashmika honeymoon | హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న విజ‌య్-ర‌ష్మిక‌.. స్పెష‌ల్ వీడియోతో షాక్ ఇచ్చిన విరోష్ జంట‌

Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌
Oscars 2026 | వైభవంగా ప్రారంభమైన 98వ ఆస్కార్ వేడుకలు.. కొత్త కేటగిరీతో చరిత్రలో కీలక మార్పు
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
Vijay Rashmika honeymoon | హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న విజ‌య్-ర‌ష్మిక‌.. స్పెష‌ల్ వీడియోతో షాక్ ఇచ్చిన విరోష్ జంట‌
TAGGED:A.R. RahmanAR Rahman musicBuchi Babu Sana filmGame Changer movieJanhvi KapoorJanhvi Kapoor Telugu debutRam CharanRam Charan birthday teaserRam Charan Peddhi TeaserTelugu movie updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Petrol Excise Duty Cut Petrol Excise Duty Cut | పెట్రోల్, డీజిల్​​పై ఎక్సైజ్​ డ్యూటీ తగ్గించిన కేంద్రం
Next Article Narhari Zirwal Video Narhari Zirwal Video | ట్రాన్స్​జెండర్​తో మంత్రి రాసలీలలు.. వీడియో వైరల్!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?