Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ram Navami in Vemulawada | వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి.. వివాహం చేసుకున్న హిజ్రాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Ram Navami in Vemulawada | వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి.. వివాహం చేసుకున్న హిజ్రాలు

తెలంగాణ

Ram Navami in Vemulawada | వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి.. వివాహం చేసుకున్న హిజ్రాలు

వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిజ్రాలు, ట్రాన్స్ జెండర్స్ వివాహం చేసుకున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 1:51 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Ram Navami in Vemulawada

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ram Navami in Vemulawada | రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లా వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శైవ క్షేత్రం అయిన వేములవాడలో యేటా శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ.

Contents
  • Ram Navami in Vemulawada | మంత్రి పొన్నం పూజలు
    • Ram Navami in Vemulawada | భక్తుల రద్దీ

రాజన్న సన్నిధిలో శ్రీరామ నవమి సందర్భంగా హిజ్రాలు, ట్రాన్స్ జెండర్స్, జోగినిలు పరమశివునిని నాధునిగా భావించి వివాహం చేసుకుంటారు. ప్రస్తుతం రాజన్న ఆలయం పునరుద్ధరణ పనులు సాగుతుండటంతో భీమేశ్వర ఆలయం (Bhimeshwara Temple)లో రామ నవమి నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున హిజ్రాలు, జోగినులు హాజరు అయ్యారు. ఒకరి మెడలో ఒకరు తాళి కట్టి వివాహం చేసుకున్నారు. రాములోరి కల్యాణం జరుగుతున్న సమయంలోనే పరమశివుని మదిలో తలుచుకుని హిజ్రాలు వివాహం చేసుకున్నారు.

Ram Navami in Vemulawada | మంత్రి పొన్నం పూజలు

శ్రీరామ నవమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)​, ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​తో కలిసి భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Ram Navami in Vemulawada | భక్తుల రద్దీ

శ్రీరామ నవమికి సాధారణం రామాలయాలు, వైష్ణవ క్షేత్రాలకు భక్తులు తరలి వస్తారు. అయితే శైవ క్షేత్రం అయిన వేములవాడకు సైతం భారీగా భక్తులు తరలి వచ్చారు. శివుడు కొలువైన వేములవాడ ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రితో పాటు శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. దీంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.

ponnam

 

వేములవాడ
శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి భీమేశ్వరాలయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొవడం జరిగింది pic.twitter.com/2FEATwHZM3

— Ponnam Prabhakar (@Ponnam_INC) March 27, 2026

దీనిని కూడా చదవండి : CSR policy Telangana | సీఎస్​ఆర్​ నిధులపై పాలసీ రూపొందించాలి : సీఎం రేవంత్​రెడ్డి

Bandi Sanjay Song | శ్రీరామనవమి సందర్భంగా పాటతో ఆకట్టుకున్న బండి సంజయ్
Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Travels Bus Smoke | ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయంతో ప‌రుగులు తీసిన ప్రయాణికులు
Miyapur Mini Bus Accident | మినీ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం
Census 2026 | మే 11 నుంచి జనగణన.. కలెక్టర్లకు సీఎస్​ సూచనలు
TAGGED:Bhimeshwar TempleHijra weddings IndiaRam Navami in VemulawadaTransgender celebrations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Raghunath Temple Raghunath Temple | రఘునాథ ఆలయంలో పీసీసీ చీఫ్​, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
Next Article Traffic Problems Traffic Problems | ట్రాఫిక్‌లోనే సగం జీవితం!
3 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Cyber Fraud | మాజీ ప్రొఫెసర్​కు సైబర్​ నేరగాళ్ల టోకరా..
  • పింగుబ్యాకు: PF Withdrawal App | పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త మొబైల్ యాప్ - Akshara Today
  • పింగుబ్యాకు: PF Withdrawal App | పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?