అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ramadan Iran Israel Conflict | ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఇప్పుడు కొనసాగుతోంది. ముస్లింలు ఉపవాసాలు ఉంటూ నిత్యం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
పవిత్రమైన రంజాన్ మాసంలో పలు ఇస్లామిక్ దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ (Israel), అమెరికా (America) దాడులతో ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ (Khameni) హతం అయిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఆయా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పవిత్రమైన రంజాన్ మాసంలో యుద్ధ మేఘాలు అలుముకోవడంతో ఆయా దేశాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Ramadan Iran Israel Conflict | డ్రోన్ దాడులు
ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. జెరూసలేం గగనతలంలో ఇరాన్ డ్రోన్‌లు కనిపించాయి. వాటిని గాల్లోనే ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. దుబాయ్, దోహా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, కువైట్, జోర్డాన్, సౌదీలోని యూఎస్ సైనిక స్థావరాలపై క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఆయా దేశాలు ఎయిర్ స్పేస్‌లను మూసి వేశాయి. రంజాన్ మాసంలో గల్ఫ్ దేశాలతో పాటు, ఇరాన్లో బాంబుల వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంతంగా పండుగ జరుపుకోవాల్సిన సమయంలో ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. దూసుకొస్తున్న క్షిపణులు, పేలుళ్ల శబ్ధాలతో ఆందోళన చెందుతున్నారు.
Ramadan Iran Israel Conflict | ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ (Donald Trump) వార్నింగ్ ఇచ్చారు. ప్రతీకారానికి దిగకపోవడమే మంచిందన్నారు. ఇరాన్ ప్రతిదాడులు చేస్తే మరింత తీవ్రంగా బదులిస్తామని ఆయన హెచ్చరించారు. ఎవరూ ఊహించని రీతిలో దాడులు ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు ఖమేనీ మృతితో ఇరాన్లో ఆయన అభిమానులు, ప్రజలు బాధ పడుతుండగా.. ఆయన వ్యతిరేక వర్గం మాత్రం సంబరాలు చేసుకుంటుంది.
ఇది కూడా చదవండి : Strait of Hormuz Oil | హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతతో 110 డాలర్లకు చమురు ధర!

