అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ramagundam NTPC Phase 2 | రామగుండం ఎన్టీపీసీ రెండో దశ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లేఖ రాశారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
Ramagundam NTPC Phase 2 | 2023లో మొదటి ఫేజ్ పూర్తి
రామగుండంలో ఎన్టీపీసీ ఏర్పాటు చేయాల్సిన 4 వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి ఫేజ్ పనులు 2023లో పూర్తయ్యాయన్నారు. సుమారు రూ. 12,000 కోట్ల వ్యయంతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో 2X800=1600 మెగావాట్ల రెండు థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. దీనిని 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)ప్రారంభించి జాతికి అంకితం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనంతరం సెకండ్ ఫేజ్‌లో భాగంగా 2,400 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన మూడు పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎన్టీపీసీ చర్యలు చేపట్టిందన్నారు. మొదటి ఫేజ్‌లో లాగే రెండో ఫేజ్‌లో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 85 శాతం విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా చేయనుందన్నారు.
Ramagundam NTPC Phase 2 | త్వరగా పూర్తి చేయాలి
తెలంగాణ (Telangana)లో విద్యుత్ డిమాండ్ మునుపెన్నడూ లేనివిధంగా 18,139 మెగావాట్లకు చేరుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ అవసరాలు మరింత పెరుగుతాయని, రాష్ట్ర గ్రిడ్ స్థిరత్వం కోసం మరికొంత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో, ఆధునికమైన ‘అల్ట్రా సూపర్ క్రిటికల్’ సాంకేతికతతో తక్కువ ఖర్చుకే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఎన్టీపీసీ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు.
Ramagundam NTPC Phase 2 | ఎన్టీపీసీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి
ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీపీసీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్ర మంత్రి కోరారు. దీనివల్ల నాణ్యమైన విద్యుత్ మన రాష్ట్రానికి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చొరవ తీసుకుని, ఎన్టీపీసీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA) చేసుకునేలా కృషి చేయాలని కోరారు.
రామగుండం ఎన్టీపీసీ (NTPC) రెండో దశ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ
రామగుండంలో NTPC ఏర్పాటు చేయవలసిన 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి ఫేజ్ లో భాగంగా దాదాపు రూ. 12,000 కోట్ల వ్యయంతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్… pic.twitter.com/ZuNWoT2WP0
— G Kishan Reddy (@kishanreddybjp) March 9, 2026
ఇది కూడా చదవండి..: Legislative Council Building | శాసన మండలి భవనం ప్రారంభం

