అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ramayana Glimpse Release | రామాయణం చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. శ్రీరాముడి పాత్ర గ్లింప్స్‌ను (A Glimpse of Lord Rama’s Character) త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
రామాణయం చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 2026లో విడుదల కానున్న భారీ మూవీగా రామాయణం నిలవనుంది. రామ గ్లింప్స్ తేదిని తాజాగా నిర్మాత నమిత్ మల్హోత్ర ప్రకటించారు. హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా ఏప్రిల్ 2న గ్రాండ్ వరల్డ్ రివీల్‌తో అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ స్థాయి క్రియేటివ్ టీమ్‌తో తెరకెక్కుతున్న ఈ ఎపిక్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Ramayana Glimpse Release | రెండు భాగాలుగా..
ప్రఖ్యాత చిత్రనిర్మాత నితేష్ తివారీ రచన, దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఇతిహాసం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభావంతులతో ఒక మైలురాయిగా నిలిచే చలనచిత్ర ఘట్టంగా నిలుస్తుందని మేకర్స్ అంటున్నారు. అంతేకాకుండా రామనవమి సందర్భంగా చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ‘రామాయణం’ (Ramayanam) సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్‌డేట్‌తో పాటు, సోషల్ మీడియాలో అత్యంత వ్యక్తిగతమైన సందేశాన్ని పోస్ట్ చేశారు.
Ramayana Glimpse Release | మనందరి కథ
ఇది మనందరికీ చెందిన కథ, మన స్వంత రామాయణాన్ని దాని నిజమైన స్ఫూర్తితో, నిజమైన స్థాయిలో అత్యంత చిత్తశుద్ధితో తెరపైకి తీసుకురావాలనే ప్రగాఢమైన బాధ్యత, భక్తి, శ్రద్ధతోనే మేము ప్రతి అడుగు వేస్తున్నామని నిర్మాత తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న రాముడి’ గ్లింప్స్‌ను పంచుకుంటామని చెప్పారు. రామాయణాన్ని కోట్లాది మంది భారతీయులు ఆరాధిస్తారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రపంచవ్యాప్తంగా భారీ సంచలనాన్ని సృష్టించింది.
Ramayana Glimpse Release | ప్రముఖ నటులతో..
రామాయణం సినిమాలో ప్రముఖ నటులు పాలుపంచుకుంటున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతునిగా నటిస్తున్నారు. కాగా రామాయణం మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి : Ram Charan Peddhi Teaser | మాస్ అవతార్‌లో రామ్ చరణ్.. బర్త్‌డే టీజర్‌తో అంచనాలు ఆకాశానికి!

