Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ramayana Teaser | హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌లైన రామాయ‌ణ టీజ‌ర్.. ఆక‌ట్టుకుంటున్న వీఎఫ్ఎక్స్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Ramayana Teaser | హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌లైన రామాయ‌ణ టీజ‌ర్.. ఆక‌ట్టుకుంటున్న వీఎఫ్ఎక్స్

సినిమాతాజా వార్తలు

Ramayana Teaser | హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌లైన రామాయ‌ణ టీజ‌ర్.. ఆక‌ట్టుకుంటున్న వీఎఫ్ఎక్స్

పౌరాణిక గాథ ‘రామాయణం’పై తెరకెక్కుతున్న భారీ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ఈ టీజర్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 2, 2026 10:41 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Ramayana Teaser

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ramayana Teaser | బాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న పౌరాణిక మహాకావ్యం ‘రామాయణం’ సినిమా (‘Ramayana’ Movie) నుంచి కీలక అప్డేట్ వెలువడింది. దర్శకుడు నితీశ్ తివారీ (Director Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హనుమాన్ జయంతి సందర్భంగా విడుద‌ల చేశారు.

Contents
  • Ramayana Teaser | అదిరిపోయిన టీజ‌ర్..
    • Ramayana Teaser | భారతీయ ఇతిహాసాన్ని మరింత గొప్పగా

ఇప్పటికే ఈ టీజర్‌ను అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ప్రత్యేక ప్రదర్శనగా చూపించారు. టీజర్ దాదాపు 2 నిమిషాల 38 సెకన్ల నిడివి కలిగి ఉండగా, రాముడి పాత్రని ఇందులో పరిచయం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా టీజర్ విడుదలై ఆక‌ట్టుకుంది. ఇందులోని వీఎఫ్ఎక్స్ అద్భుతం అని చెప్పాలి.

Ramayana Teaser | అదిరిపోయిన టీజ‌ర్..

ఈ మూవీ గురించి రణబీర్ కపూర్ (Ranbir Kapoor) మాట్లాడుతూ, రాముడి పాత్ర పోషించడం తనకు ఎంతో గౌరవం అని అన్నారు. “శ్రీరాముడు కేవలం ఒక పురాణ పాత్ర కాదు, కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం. ఆయన జీవితం మనకు ధైర్యం, కరుణ, నీతి నేర్పుతుంది. అలాంటి పాత్ర చేయడం నా అదృష్టం” అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుండగా, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ramayana Teaser | భారతీయ ఇతిహాసాన్ని మరింత గొప్పగా

ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా యశ్ నటిస్తున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే, మండోదరిగా కాజల్ అగర్వాల్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అలాగే కౌశల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, విద్యుత్జిహ్వగా వివేక్ ఒబెరాయ్, మంధరగా షీబా చద్దా కనిపించనున్నారు. ఈ చిత్రానికి వేలాది మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తుండగా, సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకులు అందిస్తున్నారు. ప్రపంచానికి భారతీయ ఇతిహాసాన్ని మరింత గొప్పగా చూపించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ‘రామాయణం’ టీజర్ విడుదలతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. 4 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుండగా, ఈ మూవీ తొలి పార్ట్ దీపావళికి రిలీజ్ కానుంది.

ఇది కూడా చదవండి..: Peddi Movie Postponed | ‘పెద్ది’ రిలీజ్‌పై గందరగోళం.. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలపై క్లారిటీ, వాయిదా వార్తలకు చెక్

Stock Market Crash | కుదేలైన స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం!
Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
Ration Card Removal | రేషన్​కార్డులు తొలగించే కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు
KTR Slams Congress | అవినీతి, అరాచకమే కాంగ్రెస్ పాలన : కేటీఆర్​
TAGGED:Bollywood mythologicalDirector Nitesh TiwariHanuman Jayanti releaseIndian cinema newsRamayana TeaserRanbir Kapoor movieSai PallaviSai Pallavi filmupcoming Bollywood moviesVFX movie India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Rotten Meat Racket Rotten Meat Racket | హైదరాబాద్‌లో కల్తీ మాంసం కలకలం.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం
Next Article Hanamkonda Pool Deaths Hanamkonda Pool Deaths | హన్మకొండ జిల్లాలో విషాదం.. సిమ్మింగ్ పూల్‌లో త‌ల్లి, ఇద్ద‌రు కుమార్తెల అనుమానాస్ప‌ద మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?