అక్షరటుడే, కామారెడ్డి: Ramchander Rao Allegations | బీజేపీని ఎదుర్కొనే దమ్ములేక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై దాడికి ఎంఐఎంను ప్రోత్సహిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) విమర్శించారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని పర్ణిక ప్యాలెస్‌లో సోమవారం నిర్వహించిన కరీంనగర్ జోనల్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యశాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
Ramchander Rao Allegations | ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేశారు..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో కొద్దిరోజులుగా ఉద్రిక్త వాతావరణం (BRS political controversy) నెలకొందన్నారు. ప్రజాస్వామ్యాన్ని(BJP Telangana news) ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కామారెడ్డి, బాన్సువాడ వెళ్తామంటే వెళ్లనివ్వలేదని, ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలో రోడ్డు పక్కన సమావేశం ఉందని రావడానికి పోలీసులు అనుమతిచ్చారని తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యే ఇంట్లో బీజేఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలు బాన్సువాడకు వెళ్తే మధ్యలో అరెస్ట్ చేశారన్నారు. తమ ఎమ్మెల్యే వద్దకే తాము రాలేని పరిస్థితి ఉందని, బాన్సువాడలో బాధితులను కలవడానికి ఒప్పుకోరని, రుద్రూర్లో మహిళా న్యాయవాదిపై దాడి జరిగితే కలవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.
Ramchander Rao Allegations | ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడి..
కాంగ్రెస్ ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై(MLA Venkata Ramana Reddy) నిజాలు మాట్లాడదాం అని సవాలు చేశారని, సవాలును స్వీకరించకుండా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేసిందన్నారు. ఎమ్మెల్యేపై దాడికి పాల్పడాల్సిన అవసరం ఏముందని, చర్చకు రమ్మంటే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. బాన్సువాడ (banswada) పట్టణంలోని షాపింగ్ మాల్లో మహిళా కార్మికురాలితో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ఆ సమయంలో పోలీసులు మౌనం ప్రదర్శించారని, 37 మంది హిందువులపై కేసులు నమోదు చేసి 20 మందిని జైలుకు పంపారని ఆరోపించారు. ఎంఐఎం వాళ్లపై కేసులు నమోదు చేశామని చెబుతున్నా వాళ్లు మాత్రం బయట గాలికి తిరుగుతున్నారని తెలిపారు. ఎంఐఎంను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రోత్సహించినంత కాలం ఆలయాలపై, హిందువులపై దాడులు జరుగుతూనే ఉంటాయన్నారు.
Ramchander Rao Allegations | కాంగ్రెస్ సమాధానం చెప్పాలి..
రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి వాతావరణం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారని, రూ.వెయ్యి కోట్ల కోసం రాహుల్ గాంధీ ఎందుకు వచ్చారని, ఇక్కడున్న నాయకులు పంపించలేక పోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు, ఆరు గ్యారెంటీలు, రైతులకు భరోసా నిధులు, ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. అప్పుడే రాహుల్ గాంధీ తెలంగాణకు రావడానికి నైతికత ఉంటుందని, లేకపోతే ఇవాళ వచ్చిన పర్యటన అనైతికమైందిగా అభివర్ణించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, నాయకులు పైడి ఎల్లారెడ్డి, మురళీధర్ గౌడ్, రంజిత్ మోహన్, మోటూరి శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay Allegations | ఎంఐఎం మెప్పు కోసమే అరెస్టులు, దాడులు: కేంద్రమంత్రి బండి సంజయ్

