అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ramlalla Darshan | చైత్ర నవరాత్రి అష్టమి సందర్భంగా అయోధ్యలోని శ్రీ రామ్ లల్లా ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు రామ్‌లల్లా దివ్య దర్శనం పొందారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
Ramlalla Darshan | ప్రత్యేక పూజలు
అష్టమి రోజున ప్రత్యేక పూజలు, అలంకరణలతో శ్రీ రామలల్లా విగ్రహాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో.. ఎవరికి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టారు.
పెరుగుతున్న రద్దీ..
ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ విడుదల చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైత్ర నవరాత్రి పర్వదినాల్లో అయోధ్యలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. వేసవి దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ ప్రముఖులు సూచిస్తున్నారు.

