Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rampa Chodavaram Tiger | మన్యంలో పెద్దపులి సంచారం.. రంపచోడవరం ప్రాంతంలో భయాందోళన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Rampa Chodavaram Tiger | మన్యంలో పెద్దపులి సంచారం.. రంపచోడవరం ప్రాంతంలో భయాందోళన

ఆంధ్రప్రదేశ్​

Rampa Chodavaram Tiger | మన్యంలో పెద్దపులి సంచారం.. రంపచోడవరం ప్రాంతంలో భయాందోళన

రంపచోడవరం మన్యం ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది. గంగవరం, అడ్డతీగల మండలాల పరిసరాల్లో పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 1:39 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Rampa Chodavaram Tiger
Rampa Chodavaram Tiger

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rampa Chodavaram Tiger | తూర్పుగోదావరి మన్యం ప్రాంతంలోని రంపచోడవరం పరిసరాల్లో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా గంగవరం మరియు అడ్డతీగల మండలాల పరిధిలో పులి (Tiger) తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో గ్రామాల్లో ఒక్కసారిగా భయభ్రాంతులు నెలకొన్నాయి.

Contents
  • Rampa Chodavaram Tiger | పులి భ‌యం..
    • Rampa Chodavaram Tiger | అటవీశాఖ అధికారుల సందేశాలు

గంగవరం మండలం (Gangavaram Mandal) మొల్లవరం గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అలాగే అడ్డతీగల మండలం తిమ్మాపురం సమీపంలో రాత్రి సమయంలో పులి కనిపించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

Rampa Chodavaram Tiger | పులి భ‌యం..

పులి సంచారం వార్తతో మన్యం ప్రాంతంలోని పలు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు వెళ్లేందుకు గ్రామస్తులు భయపడుతున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పులి కదలికలను గమనించేందుకు అటవీశాఖ (Forest Department) ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పులి పాదముద్రలను (పగ్‌మార్క్స్) సేకరిస్తూ అది ఏ దిశగా కదులుతోందో అంచనా వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పులి కదలికలపై ఖచ్చితమైన సమాచారం కోసం అటవీశాఖ అధికారులు (Forest officers) అడవిలో పర్యవేక్షణను మరింత పెంచారు.

Rampa Chodavaram Tiger
Rampa Chodavaram Tiger

Rampa Chodavaram Tiger | అటవీశాఖ అధికారుల సందేశాలు

అయితే ఈ పులి మెడలో రేడియో కాలర్ అమర్చివుండటం అధికారులకు కొంతవరకు సహాయకరంగా మారింది. రేడియో కాలర్ ద్వారా వచ్చే శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా పులి ప్రస్తుతం ఏ ప్రాంతంలో సంచరిస్తోంది, అది ఎటువైపు కదులుతోంది అనే విషయాలను అధికారులు నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. ఈ సమాచారంతో పులి సంచారాన్ని నియంత్రించే చర్యలను అటవీశాఖ చేపడుతోంది. ముందస్తు జాగ్రత్త చర్యగా గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వరం మండలాల పరిధిలోని గ్రామాలకు అటవీశాఖ అధికారులు అప్రమత్తత సందేశాలు పంపించారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లవద్దని, అడవి ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని గ్రామస్తులకు సూచించారు. పులి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు.

మన్యం ప్రాంతంలో పులి సంచారం నేపథ్యంలో అధికారులు పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ప్రజల భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. గ్రామస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..

Snake Bite Incident | కాటేసిన పాముతో హాస్పిటల్​కు వెళ్లిన వ్యక్తి
Ice Cream Ban Guduru | ఐస్‌క్రీం బండ్లకు నో చెప్పిన గ్రామం.. గూడూరు ప్రజల వినూత్న నిర్ణయంపై ప్ర‌శంస‌లు
Temple Circuit | బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్
Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం
bribery case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు కార్యదర్శి
TAGGED:andhra pradesh wildlife news 🐅east godavari forest newsforest department alertGangavaram Mandalmanayam forest newsrampa chodavaram tigertiger movement andhra pradeshtiger sighting indiawildlife tracking radio collar
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyderabad Bomb Threat Hyderabad Bomb Threat | హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపులు
Next Article Tirumala Forest Fire Tirumala Forest Fire | తిరుమల కొండల్లో కార్చిచ్చు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?