Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ramzan charity message | పేదలకు సహాయం చేయడమే రంజాన్​ పరమార్థం: షబ్బీర్ అలీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Ramzan charity message | పేదలకు సహాయం చేయడమే రంజాన్​ పరమార్థం: షబ్బీర్ అలీ

నిజామాబాద్

Ramzan charity message | పేదలకు సహాయం చేయడమే రంజాన్​ పరమార్థం: షబ్బీర్ అలీ

ఆకలి విలువ తెలుసుకుంటూ పేదలకు సహాయం చేయడమే రంజాన్ పండుగ పరమార్థమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 21, 2026 7:32 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
Ramzan charity message

అక్షరటుడే, కామారెడ్డి: Ramzan charity message | ఆకలి విలువ తెలుసుకుంటూ పేదలకు సహాయం చేయడమే రంజాన్ పండుగ పరమార్థమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. రంజాన్ సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఓల్డ్ ఈద్గాలో రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

Contents
  • Ramzan charity message | ముస్లిం మత పెద్దలతో కలిసి..
    • Ramzan charity message | షబ్బీర్ అలీకి ఎస్పీ విషెస్..
      • షబ్బీర్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు

Ramzan charity message | ముస్లిం మత పెద్దలతో కలిసి..

ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, సహనానికి నిలువుటద్దమని పేర్కొన్నారు. గంగా-జమునా తెహజీబ్ సంస్కృతితో అందరూ కలిసి మెలిసి పండుగను జరుపుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అల్లాహ్ దీవెనలు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Ramzan charity message

Ramzan charity message | షబ్బీర్ అలీకి ఎస్పీ విషెస్..

రంజాన్ సందర్భంగా ఆర్డీవో కార్యాలయం (RDO Office) వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తును స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీతో పాటు కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి దంపతులు షబ్బీర్ ఆలీకి శుభాకాంక్షలు తెలిపారు.

షబ్బీర్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు

అక్షటుడే, ఎల్లారెడ్డి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతీలాల్ రంజాన్​ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉన్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ali 1

ఇది కూడా చదవండి..: Ramzan celebrations MLAs | రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు..

Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలి: కలెక్టర్​
Sand Smuggling Checkpost | ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చెక్​పోస్ట్​ ఏర్పాటు: టీజీఎండీసీ మేనేజింగ్​ డైరెక్టర్ భవేష్ మిశ్రా
ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్
PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి
Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు
TAGGED:Eid prayershelping poormuslim festival indiaRamadan 2026Ramzan charityRamzan charity messageShabbir AliShabbir Ali speechsocial harmonyTelanganaTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article KTR Congress Guarantees KTR Congress Guarantees | గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టింది..: కేటీఆర్​
Next Article LPG cylinder supply LPG cylinder supply | ఎల్​పీజీపై కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రాలకు అదనంగా సిలిండర్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?