అక్షరటుడే, వెబ్డెస్క్ : Ramzan Holiday in AP | రంజాన్ పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం (State Government) సెలవు తేదీలో మార్పులు చేసింది. ముందుగా ఈనెల 20వ తేదీ (శుక్రవారం)ను రంజాన్ సాధారణ సెలవుగా ప్రకటించినప్పటికీ, ఆ రోజు నెలవంక కనిపించకపోవడంతో వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు సెలవును ఈనెల 21వ తేదీ (శనివారం)కు మార్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ వెల్లడించారు.
ఈ మేరకు జీఓ ఆర్టీ సంఖ్య: 612 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా షాపులు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లకు సంబంధించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 ప్రకారం కూడా జీఓ ఆర్టీ సంఖ్య: 613 ద్వారా సెలవు తేదీ మార్పును అమలు చేశారు.
Ramzan Holiday in AP | శుక్రవారం యథావిధిగా..
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మార్చి 20వ తేదీన (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు , విద్యాసంస్థలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఇక ఈ మార్పు ప్రభావం పదో తరగతి పరీక్షల (SSC Exams)పై కూడా పడింది. ముందుగా మార్చి 21న జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసి, ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొదట ఈ పరీక్షను మార్చి 20న నిర్వహించాలని షెడ్యూల్ ఉండగా, రంజాన్ సెలవు కారణంగా 21కు మార్చారు. అయితే ఇప్పుడు సెలవు తేదీ మార్పుతో పరీక్షను పూర్తిగా వాయిదా వేయాల్సి వచ్చింది.
ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పరీక్షా ప్రణాళికలను అనుగుణంగా మార్చుకోవాలని విద్యాశాఖ (Education Department) సూచించింది.ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ముందుగానే మార్చి 21న రంజాన్ సెలవుగా ప్రకటించారు. దీంతో తెలంగాణలో ఎలాంటి మార్పులు లేవు.
ఇది కూడా చదవండి..: Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం

