అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ranu Bombayiki Ranu Song | తెలుగు జానపద సంగీతం మరో గొప్ప మైలురాయిని చేరింది. 2025లో విడుదలైన ‘రానూ బొంబాయికి రానూ’ ఫోక్ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా రికార్డు స్థాయి స్పందనను సొంతం చేసుకుంది. ఈ పాట 800 మిలియన్ల (80 కోట్ల) వ్యూస్‌ను దాటింది.
Ranu Bombayiki Ranu Song | విపరీతమైన ఆదరణ
రాము రాథోడ్ ఈ పాటకు లిరిక్స్ రాశారు. తానే స్వయంగా పాడి, నటించారు. ఆయన ప్రత్యేక శైలి, గ్రామీణ భాషలోని మాధుర్యం పాటకు విపరీతమైన ఆదరణ తెచ్చిపెట్టింది. సంగీత దర్శకుడు కళ్యాణ్ అందించిన బాణీ పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. రాముకు జోడీగా లిఖిత ఆడి పాడి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.
Ranu Bombayiki Ranu Song | ఆకట్టుకునే ట్యూన్
పాటలోని ఆకట్టుకునే ట్యూన్, సరళమైన పదాలు, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే విజువల్స్—కలిసి ఈ పాటను అన్ని వర్గాలకు చేరువ చేశాయి. సోషల్ మీడియాలో సైతం ఈ పాట విపరీతంగా వైరల్ అవుతూ, రీల్స్, షార్ట్ వీడియోలలో విస్తృతంగా కనిపిస్తోంది.
తెలుగు పాటలలో అత్యధిక వ్యూస్ సాధించిన రికార్డు ఇప్పటికీ Butta Bomma పేరిట ఉంది. జానపద గీతాల విభాగంలో తాజాగా ‘రానూ బొంబాయికి రానూ’ కొత్త రికార్డు నెలకొల్పింది.
ఇది కూడా చదవండి: Kidney Stones Beer Myth | బీరు తాగితే కిడ్నీ రాళ్లు కరుగుతాయా.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే!
