అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ration Card Removal | రేషన్ కార్డులు (Ration Cards) తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. బుధవారం ఆమె నిరుద్యోగుల సమస్యలపై మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) మొన్నటి వరకు ఐదు లక్షల కార్డులు ఇచ్చామని చెప్పిందని, కానీ ప్రస్తుతం కార్డులను తొలగించడానికి చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు ఐటీ కట్టిన వారి వివరాలు సేకరిస్తున్నారని ఆమె చెప్పారు. రేషన్ కార్డుల తొలగింపు కోసం చేపట్టిన సర్వేను ఆపాలని డిమాండ్ చేశారు. ఐటీ కట్టిన వారి కార్డులను తొలగించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. మొత్తం 15 లక్షల కార్డుల తొలగింపునకు జరుగుతున్న సర్వేను నిలిపివేయాలన్నారు.
Ration Card Removal | ఆ జీవోలను రద్దు చేయాలి
నిరుద్యోగులకు అడ్డంకిగా ఉన్న జీవోలను వెంటనే రద్దు చేయాలని కవిత (Kavitha) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని విమర్శించారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ చేయించుకునే మహిళలకు డబ్బులు, కిట్లు ఇచ్చేవారన్నారు. వాటిని కాంగ్రెస్ వచ్చాక ఆపేశారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదన్నారు.
Ration Card Removal | జాబ్ క్యాలెండర్ ఎక్కడ..
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ఎందుకు జాబ్ క్యాలెండర్ (Job Calendar) విడుదల చేయడం లేదని కవిత ప్రశ్నించారు. డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ వేయాలంటే జీవో నంబర్ 4 అడ్డంకిగా మారిందన్నారు. దానిని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీసుకొచ్చారన్నారు. డిగ్రీ అధ్యాపకుల భర్తీ విషయంలో కొత్తగా ఇంటర్వ్యూ విధానం తీసుకొచ్చారని, అలాగే పీహెచ్డీ చేసిన వారికి అదనంగా 15 మార్కులు ఇస్తామని ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు.
గ్రూప్ 1 లో కొంత మందిని సెలెక్ట్ చేసుకోడానికి కొన్ని సెంటర్లు ఏర్పాటు చేశారో, డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ పార్టీ (Congress Party) అనుచరులకు, కార్యకర్తలకు ఇప్పించుకోడానికే జీవో నంబర్ 4 తెచ్చారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్ట్‌పై రివ్యూ చేసే సీఎంకు నిరుద్యోగుల గురించి పట్టించుకోవడానికి సమయం లేదని ఆమె విమర్శించారు. నిరుద్యోగులను విస్మరిస్తే జాగృతి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: PACS Bank Employees Drunk | సహకార బ్యాంక్‌లో మద్యం తాగిన ఉద్యోగులు
