Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ravi Bishnoi | బిష్ణోయ్ మాయాజాలం.. రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లిస్తున్నాడుగా..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Ravi Bishnoi | బిష్ణోయ్ మాయాజాలం.. రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లిస్తున్నాడుగా..

క్రీడలు

Ravi Bishnoi | బిష్ణోయ్ మాయాజాలం.. రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లిస్తున్నాడుగా..

రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పి రాజస్థాన్ రాయల్స్​కు సంచలన విజయం అందించాడు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 2:32 సా.
Srinivas Kolluri
16 గంటలు ago
Share
Ravi Bishnoi

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ravi Bishnoi | ఐపీఎల్ 2026 (Ipl 2026) సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) అదృష్టం జోరులో దూసుకుపోతోంది. ముఖ్యంగా యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు.

తాజాగా గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన మ్యాచ్‌లో బిష్ణోయ్ ఒంటరిగా గేమ్‌ను మలుపుతిప్పి హీరోగా నిలిచాడు. అహ్మదాబాద్‌ (Ahmedabad)లో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపించింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ 73 పరుగులతో క్రీజులో సెటిల్ అవుతూ మ్యాచ్‌ను గుజరాత్ వైపు తిప్పుతున్నట్లు కనిపించాడు.అయితే ఆ సమయంలో బంతిని అందుకున్న బిష్ణోయ్ తన గూగ్లీలతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. వరుసగా కీలక వికెట్లు తీసి గుజరాత్ ఇన్నింగ్స్‌ను కుదేలు చేశాడు. మొత్తం 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన అతను, ముఖ్యంగా సాయి సుదర్శన్ వికెట్ తీసి టర్నింగ్ పాయింట్‌గా నిలిచాడు.

Ravi Bishnoi | చివర్లో దేశ్‌పాండే చక్కటి బౌలింగ్

మ్యాచ్ చివరి ఓవర్‌లో తుషార్ దేశ్‌పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి 11 పరుగులను కాపాడుకోవడం రాజస్థాన్ విజయానికి కీలకంగా మారింది. గుజరాత్ చివరి వరకు పోరాడినా, రాజస్థాన్ బౌలర్ల వ్యూహాల ముందు నిలవలేకపోయింది. మ్యాచ్ అనంతరం బిష్ణోయ్ (Ravi Bishnoi) మాట్లాడుతూ గత సీజన్ తనకు చాలా కఠినంగా గడిచిందని చెప్పాడు. “నా లెంగ్త్‌లో చిన్న తప్పు జరిగినా బ్యాటర్లు భారీ షాట్లు ఆడేవారు. అందుకే ఈసారి ఆఫ్ సీజన్‌లో ఫిట్‌నెస్, లెంగ్త్‌పై ప్రత్యేకంగా వర్క్ చేశాను. డొమెస్టిక్ క్రికెట్ ద్వారా నా తప్పులను సరిదిద్దుకున్నాను. ఈరోజు నా వైవిధ్యమైన బౌలింగ్ వల్లే వికెట్లు దక్కాయి” అని వెల్లడించాడు.

గత రెండు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన బిష్ణోయ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. 2024లో 14 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు, 2025లో 11 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు మాత్రమే తీసి విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో లక్నో జట్టు అతన్ని వదిలేసింది. అయితే 2026 వేలంలో రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals) అతనిపై నమ్మకం ఉంచి రూ.7.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ నమ్మకాన్ని బిష్ణోయ్ మొదటి రెండు మ్యాచ్‌ల్లోనే అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. జట్టులో బౌలింగ్ యూనిట్ బలంగా కనిపిస్తుండటంతో ఈ సీజన్‌లో ఫైనల్ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Shreyas Iyer | గెలిచిన సంతోషం లేదు.. స్లో ఓవర్ రేటుతో శ్రేయస్ అయ్యర్‌కి భారీ జరిమానా

MS Dhoni Traffic Fine | రూల్స్ ఉల్లంఘించిన ఎంఎస్ ధోని.. ట్రాఫిక్ పోలీసులు ఎంత జ‌రిమానా విధించారంటే..!
Chahal Fitness IPL 2026 | ఐపీఎల్ 2026 కోసం కొత్త నిర్ణయం తీసుకున్న చాహల్… ఆరు నెలలుగా మద్యానికి దూరం
India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం
Suryakumar Yadav Retirement | సూర్య‌కుమార్ రిటైర్ కాబోతున్నాడంటూ ప్ర‌చారాలు.. ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చిన టీ20 కెప్టెన్
India T20 Final | ఫైనల్​లో దంచికొట్టిన భారత్​.. కివీస్​ లక్ష్యం 256
TAGGED:Bowling HeroCricket HighlightsGujarat TitansIPL 2026Leg SpinnerRajasthan RoyalsRavi Bishnoi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Youth suicide phone denial | Youth suicide phone denial | సెల్‌ఫోన్ కొనివ్వలేదని ప్రాణం తీసుకున్న యువకుడు..
Next Article HPV vaccine awareness | HPV vaccine awareness | హెచ్​పీవీ వ్యాక్సిన్​పై అపోహలొద్దు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?