Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: RBI Repo Rate | వడ్డీ రేట్లు యథాతథం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - RBI Repo Rate | వడ్డీ రేట్లు యథాతథం

జాతీయం

RBI Repo Rate | వడ్డీ రేట్లు యథాతథం

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. రెపో రేటు 5.25 వద్ద కొనసాగనుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 8, 2026 11:04 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
15 గంటలు ago
Share
RBI Repo Rate

అక్షరటుడే, వెబ్​డెస్క్: RBI Repo Rate | దేశీయ ఆర్థిక వ్యవస్థను సమతుల్యంగా ఉంచడం కోసం ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుంటుంది. ద్రవ్యోల్బణం నియంత్రణ, ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహం అందించడం, ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రించడం లక్ష్యాలుగా వడ్డీ రేట్లను పెంచడం కానీ, తగ్గించడం కానీ చేస్తుంది. ఇందుకోసం ప్రతి రెండు నెలలకోసారి ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ (Committee Meeting) నిర్వహిస్తారు.

Contents
  • RBI Repo Rate | రెపో రేటు పెంచితే ఏం జరుగుతుందంటే..
    • RBI Repo Rate | వడ్డీ రేట్లు తగ్గిస్తే..
      • RBI Repo Rate | ఏడాదిన్నరలో 125 బేసిస్ పాయింట్ల తగ్గింపు..
        • RBI Repo Rate | ఈసారీ యథాతథంగా..

మూడు రోజులపాటు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ధరలు వేగంగా పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం కేంద్ర బ్యాంక్ రెపో రేట్‌ను పెంచుతుంది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులతో ఆర్థిక మాంద్యం పెరిగే ప్రమాదం ఉండడంతో ఆర్‌బీఐ 2004 డిసెంబర్ వరకు విడతల వారీగా రెపో రేటును పెంచుతూ వెళ్లింది. ఆ ఏడాది డిసెంబర్‌లో వడ్డీ రేట్లు 6.50 శాతం వద్ద గరిష్టాన్ని తాకాయి.

RBI Repo Rate | రెపో రేటు పెంచితే ఏం జరుగుతుందంటే..

ఆర్‌బీఐ రెపో రేటును పెంచితే పలు మార్పులు చోటు చేసుకుంటాయి. బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి ఎక్కువ వడ్డీకి డబ్బు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే వినియోగదారులపైనా భారం పడుతుంది. బ్యాంకులనుంచి తీసుకున్న Home loan, కార్ లోన్ తదితరాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా ప్రజలు అప్పులు తీసుకోవడం తగ్గిస్తారు. ఖర్చు చేసే స్థోమత తగ్గడం వల్ల డిమాండ్ తగ్గుతుంది. దీని వల్ల ధరలు స్థిరపడడం కానీ, తగ్గడం కానీ జరుగుతుంది. అధిక ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రించడానికి రెపో రేటు పెంచడం దోహదపడుతుంది. 2022 నుంచి 2024 మధ్య కాలంలో వడ్డీ రేట్లు 4 శాతంనుంచి 6.5 శాతానికి పెరిగాయి.

RBI Repo Rate | వడ్డీ రేట్లు తగ్గిస్తే..

ఆర్థికవృద్ధి మందగిస్తున్నట్లు గానీ, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నట్లుగానీ ఆర్‌బీఐ (RBI) భావిస్తే రెపో రేట్లను తగ్గించడానికి చర్యలు తీసుకుంటుంది. వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. తద్వారా వినియోగదారులకు తక్కువ వడ్డీకే రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది. దీంతో మార్కెట్‌లో లిక్విడిటీ పెరిగి కొనుగోలు శక్తి పెరిగి ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.

RBI Repo Rate | ఏడాదిన్నరలో 125 బేసిస్ పాయింట్ల తగ్గింపు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) రెపో రేటును గరిష్టాలనుంచి ఏడాదిన్నర కాలంలో 125 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇది ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం కోసం చేసిన రేట్ కట్.
2024 డిసెంబర్‌లో రెపో రేటు 6.50 శాతంగా ఉంది. 2025 ఫిబ్రవరిలో ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో రెపో రేటు 6.25 శాతానికి తగ్గింది.
ఏప్రిల్‌లో 25 పాయింట్లు, జూన్‌లో 50 పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు 5.50 శాతంగా ఉంది.
ఆగస్టు, అక్టోబర్‌లలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.
డిసెంబర్‌లో 25 పాయింట్లు తగ్గించడంతో రెపోరేటు 5.25 శాతానికి తగ్గింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను తగ్గించలేదు.

RBI Repo Rate | ఈసారీ యథాతథంగా..

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీంతో రెపో రేటు 5.25 వద్ద కొనసాగనుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర భారీగా పెరగడం, రూపాయి విలువ గణనీయంగా క్షీణించడం, ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి..: Toll Rules Change | ఏప్రిల్ 10 నుంచి టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు.. నగదు రద్దు, కొత్త విధానం అమలు

Petrol Gas Shortage India | దేశంలో పెట్రోల్​, గ్యాస్​ కొరత లేదు : కేంద్ర మంత్రి
ISIS Threat Hindus | దక్షిణాసియాలో హిందువులపై దాడులకు ఐసిస్ పిలుపు.. సీఈపీ నివేదికలో సంచలన వివరాలు
Kerala Elections | కేంద్ర నిధులను లెఫ్ట్​ పార్టీ లూటీ చేసింది : ప్రధాని మోదీ
Air India Flight Return | 8 గంటలు ప్రయాణించి తిరిగొచ్చిన విమానం.. ప్రయాణికులకు చేదు అనుభవం
Rajnath Singh Warns Pakistan | పాకిస్తాన్‌కు రాజనాథ్ సింగ్ మాస్ వార్నింగ్.. ఆ దేశం ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాల‌ని వ్యాఖ్య‌
TAGGED:Banking news IndiaCommittee MeetingCrude Oileconomic updateinflation indiainterest rates indialoan interest ratesRBIrbi policy newsrepo rate updateReserve Bank of India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Trump Iran Ceasefire Trump Iran Ceasefire | ప్రపంచ శాంతికి గొప్ప రోజు.. సీజ్​ఫైర్​పై ట్రంప్​
Next Article Mohsina Kidwai Death Mohsina Kidwai Death | కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?