అక్షరటుడే, వెబ్‌డెస్క్: RCB Sale Deal | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాంచైజీ విక్రయం డీల్ పూర్తయింది. మోస్ట్ పాపులర్ టీమ్‌లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీని ఆధిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ వంటి సంస్థలతో కూడిన కన్సార్టియం కొనుగోలు చేసింది.
ఈ విషయాన్ని కుమార మంగళం బిర్లా మరియు సత్యన్ గజ్వానీ అధికారికంగా ప్రకటించారు. మొత్తం రూ.16,706 కోట్లకు ఈ డీల్ కుదిరినట్లు వెల్లడించారు. ఈ ఒప్పందంలో RCB పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టును కూడా కలిపి కన్సార్టియం స్వాధీనం చేసుకుంది.
RCB Sale Deal| 500 కోట్ల నుంచి 16,706 కోట్లకు ..
2008లో ఐపీఎల్ ప్రారంభ సమయంలో RCB ఫ్రాంచైజీ విలువ కేవలం రూ.500 కోట్లు మాత్రమే. అప్పట్లో ఈ జట్టును ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యల కారణంగా ఆయన వైదొలగడంతో, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) ఈ జట్టును నిర్వహించింది. కాలక్రమేణా RCB భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకోవడం, ఇటీవల IPL 2025 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలవడం వంటి అంశాలు ఫ్రాంచైజీ విలువను గణనీయంగా పెంచాయి. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా విక్రయమైంది. అమెరికాకు చెందిన టెక్ వ్యాపారవేత్త నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును సుమారు రూ.15,300 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రారంభంలో కేవలం రూ.300 కోట్లకు అమ్ముడైన ఈ ఫ్రాంచైజీ కూడా భారీ విలువను సాధించడం విశేషం.
RCB Sale Deal | ఇలాంటి భారీ డీల్‌లకు దారితీసే అవకాశాలు
ఈ రెండు కీలక డీల్‌లకు ఇంకా బీసీసీఐతోపాటు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (Competition Commission of India) నుంచి తుది అనుమతులు రావాల్సి ఉంది. అనుమతులు వచ్చిన వెంటనే అధికారికంగా యాజమాన్య మార్పు అమల్లోకి రానుంది. కాగా, RCB విక్రయం ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ అంతర్జాతీయ స్థాయిలో ఎంతగా పెరిగిందో మరోసారి స్పష్టమైంది. భవిష్యత్తులో మరిన్ని ఫ్రాంచైజీలు కూడా ఇలాంటి భారీ డీల్‌లకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..: Ishan Kishan SRH | SRH ప్రాక్టీస్ మ్యాచ్‌లో హీటెక్కిన సన్నివేశం.. కెప్టెన్‌నే గెటౌట్ అంటూ సైగ చేసిన యువ క్రికెటర్

