Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Realme Narzo Power 5G | ఇది రియల్‌మీ ‘పవర్’!.. భారీ బ్యాటరీతో లాంచింగ్‌కు సిద్ధం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Realme Narzo Power 5G | ఇది రియల్‌మీ ‘పవర్’!.. భారీ బ్యాటరీతో లాంచింగ్‌కు సిద్ధం

బిజినెస్​తాజా వార్తలు

Realme Narzo Power 5G | ఇది రియల్‌మీ ‘పవర్’!.. భారీ బ్యాటరీతో లాంచింగ్‌కు సిద్ధం

రియల్‌మీ మరో మోడల్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. భారీ బ్యాటరీతో వస్తున్న రియల్‌మీ నార్జో పవర్ 5 జీ ఫోన్ వచ్చేనెల 5న రిలీజ్ కానుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 2:21 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Realme Narzo Power 5G
Realme Narzo Power 5G

అక్షరటుడే, వెబ్​డెస్క్: Realme Narzo Power 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ (Smartphone) కంపెనీలు పెద్ద బ్యాటరీలపై దృష్టిసారించాయి. ఏకంగా పదివేల ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీలను తమ కస్టమర్లకోసం తీసుకువస్తున్నాయి. చైనాకు చెందిన రియల్‌మీ (Realme) సైతం ఈ రేంజ్ ఫోన్లపై ఫోకస్ చేసింది. ఇటీవలే 10,001 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల రియల్‌మీ పీ4 పవర్ అనే ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసింది.

ఇంత పెద్ద బ్యాటరీతో మరో కొత్త మోడల్‌ను రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో రియల్‌మీ నార్జో పవర్ 5 జీ పేరుతో వచ్చేనెల 5న మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లో రిలీజ్ చేయనుంది. అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో లీకైన సమాచారం మేరకు ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇలా ఉండే అవకాశాలున్నాయి.

Realme Narzo Power 5G | డిస్‌ప్లే :

6.8 అంగుళాల 4 కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 144 హెచ్‌జెడ్‌తో తీసుకువస్తున్నారు. 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. సూర్యకాంతిలోనూ స్పష్టంగా డిస్‌ప్లే కనిపిస్తుంది. ఐపీ66/68/69 రేటింగ్స్‌తో వాటర్, డస్ట్ నుంచి తట్టుకుంటుంది.

Realme Narzo Power 5G | బ్యాటరీ సామర్థ్యం :

10,001 ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. సింగిల్ చార్జ్‌తో 2 రోజుల వరకు ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది. 80డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. 27డబ్ల్యూ వైర్డ్ రివర్స్ చార్జింగ్ సౌలభ్యం కూడా ఉంది. అంటే ఈ ఫోన్‌తో ఇతర ఫోన్లను కూడా చార్జ్ చేయవచ్చు. 185.7 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 72.3 గంటల కాలింగ్, 32.5 గంటల యూట్యూబ్ ప్లే చేయవచ్చని కంపెనీ తెలిపింది. 36 నిమిషాలలో 50 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుందని పేర్కొంది.

సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5జీ చిప్‌సెట్ ఉపయోగించారు. ఎల్‌పీడీడీఆర్‌4ఎక్స్ ర్యామ్ మరియు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. మూడేళ్లపాటు ఓఎస్, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనుంది.

కెమెరా సెటప్ : 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ఓఐఎస్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఇవి 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది.

ఏఐ ఫీచర్స్ : ఏఐ హైపర్ క్లారిటీ, ఏఐ హైపర్ మోషన్, ఏఐ ఆల్వేస్ ఆన్ హెచ్‌డీఆర్, ఏఐ స్మార్ట్ రిప్లై, ఏఐ స్టైల్‌మీ, ఏఐ ఎడిట్ జెనీ, ఇన్‌స్టంట్ క్లిప్, లైట్‌మీ లైటింగ్ ఎఫెక్ట్‌లు మరియు గేమింగ్ కోసం ఏయిమ్ అసిస్ట్ వంటి ఫీచర్లున్నాయి.

ఇది కూడా చదవండి..: february 27 gold price | పసిడి పరుగులకు బ్రేక్.. తులంపై రూ.870 తగ్గుద‌ల‌!

Foot Care | నడక కష్టమవుతోందా.. పాదాలు వాచాయా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
Kavitha Clean Chit | కవిత కడిగిన ముత్యం.. చివరకు నిజమే గెలిచింది.. : సూదం లక్ష్మి
Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేయనున్న జీవన్​రెడ్డి.. ఏ పార్టీలో చేరుతారో?
Samsung Galaxy M17e | శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే?
Beer Price Hike | కిక్కు దించుతున్న యుద్ధం.. బీర్ల ధరలు పెంపు తప్పదా..!
TAGGED:10001mAh battery phone6.8-inch AMOLED displayAI camera featuresfast charging 80WMediaTek Dimensity 7400Realme India launchRealme Narzo Power 5GRealme smartphone newsSmartphone
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article HPV Vaccination Drive HPV Vaccination Drive | ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ : మంత్రి రాజనర్సింహ
Next Article Telangana Power Demand Telangana Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?