అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Realme P4 Lite 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ (Smart Phone)ల తయారీ కంపెనీ అయిన రియల్‌మీ.. పీ సిరీస్‌లో మరో మోడల్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. గతనెలలో పీ4 లైట్ పేరుతో 4జీ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసిన ఈ కంపెనీ.. సామర్థ్యాన్ని పెంచి 5జీ మోడల్‌ను తీసుకువచ్చింది.
భారీ బ్యాటరీ, శక్తిమంతమైన ప్రాసెసర్‌తో తీసుకువచ్చిన ఈ ఫోన్‌ను ఈనెల 19న విడుదల చేసింది. సేల్ 25 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart), రియల్‌మీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉండే అవకాశాలున్నాయి.
Realme P4 Lite 5G | డిస్‌ప్లే
6.8 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇది 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 5.6 లక్షల అంటుటు స్కోర్, ఐపీ 64 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కలిగి ఉంది.
Realme P4 Lite 5G | సాఫ్ట్‌వేర్
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్ మీ యూఐ 7.0 తో పనిచేస్తుంది. యూఎఫఎస్ 2.2 స్టోరేజీ సపోర్ట్ ఉండడం వల్ల మల్టీ టాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్ వేడెక్కక్కుండా ఉండేందుకు ఎయిర్‌ఫ్లో వీసీ కూలింగ్ కలిగి ఉంది.
రెండేళ్లపాటు ఓఎస్, మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
కెమెరా : వెనకవైపు డ్యుయల్ మ్యాట్రిక్స్ ఏఐ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 13 ఎంపీ మెయిన్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ : 7000 ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీ ఉపయోగించారు. ఇది 15 డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఆరేళ్లకుపైగా మన్నుతుందని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి బ్యాటరీని ఫుల్ చార్జ్ చేస్తే 22 గంటల 22 నిమిషాల పాటు వాట్సాప్ చూడొచ్చని, 11.12 గంటలపాటు హెవీ గేమింగ్ సపోర్ట్ చేస్తుందని, 19.35 గంటలపాటు యూట్యూబ్, 140 గంటలపాటు నాన్‌స్టాప్ మ్యూజిక్ ప్లే చేయొచ్చని హామీ ఇస్తోంది.
వేరియంట్స్ : మొజాయిక్ బ్లూ, మొజాయిక్ గ్రీన్ కలర్స్‌లో, మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999.
4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999.
6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999.
కార్డ్ ఆఫర్ : లాంచ్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 500 వరకు తక్షణ డిస్కౌంట్‌తోపాటు 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఇది కూడా చదవండి..: March 23 Gold Rates | అతివలకు అదిరిపోయే శుభవార్త.. రోజు రోజుకి దిగి వస్తున్న బంగారం ధరలు

