Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Record Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Record Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​

తెలంగాణతాజా వార్తలు

Record Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​

ఎన్​పీడీసీఎల్​ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​ నమోదు అయింది. గురువారం 6,457 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినట్లు సీఎండీ తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 26, 2026 3:59 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
Record Power Demand

అక్షరటుడే, వెబ్​డెస్క్:  Record Power Demand | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. దీంతో విద్యుత్​ వినియోగం భారీగా పెరిగింది. ఎన్​పీడీసీఎల్​ పరిధిలో గురువారం 6,457 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ రికార్డు నమోదు అయింది.

Contents
  • Record Power Demand | ఎండలు మండుతుండటంతో..
    • Record Power Demand | నిరంతర సరఫరా

విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ (TGNPDCL) చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్​రెడ్డి తెలిపారు. 6,457 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ ఇది సంస్థ చరిత్రలోనే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ఎన్​పీడీసీఎల్​ ఈ నెల 3న 6,441 మెగావాట్ల రికార్డు నెలకొల్పగా.. తాజాగా దానిని అధిగమించింది. ఇది సంస్థ నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనమని సీఎండీ తెలిపారు.

Record Power Demand | ఎండలు మండుతుండటంతో..

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గతం వారం రోజులుగా కాస్త చల్లబడిన వాతావరణం గురువారం మారిపోయింది. ఉష్ణోగ్రతలు (Temperatures) ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఏసీ, కూలర్లు, ఫ్రిజ్​ల వినియోగం భారీగా పెరిగింది. దీనికి తోడు ప్రస్తుతం వరి పొలాలు ఈనిక దశలో ఉన్నాయి. సాగునీరు అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో వ్యవసాయ బోర్లు నిరంతరయంగా నడుస్తున్నాయి. ఫలితంగా విద్యుత్​ వినియోగం భారీగా పెరిగింది.

Record Power Demand | నిరంతర సరఫరా

డిమాండ్ ఎంత పెరిగినా సరే వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తామని సీఎండీ వరుణ్​రెడ్డి  (CMD Varun Reddy) తెలిపారు. విద్యుత్​ సరఫరాలో అంతరాయం లేకుండా ఇప్పటికే ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్ లైన్లు, సబ్-స్టేషన్లపై నిర్వహణ, ఆధునీకరణ పనులు ముందుగానే పూర్తి చేశామన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Fake ice cream | కల్తీ ఐస్​క్రీముల తయారీ.. నిందితుడి అరెస్ట్

Gold After Death | చనిపోయిన వారి నగలకు దోషం ఉంటుందా.. మరణానంతరం వాటిని ఏమి చేయాలి?
Deepa Aradhana Significance | హిందూ సంప్రదాయంలో దీపారాధన ఆనవాయితీ.. ఆ రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Air India Plane Accident | ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
Sunflower Seeds Beauty | సన్‌ఫ్లవర్ గింజలతో ఇలా చేస్తే.. రెట్టింపు అందం సొంతం!
March 06 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
TAGGED:CMD Varun Reddyrecord power demandTemperaturesTGNPDCL
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article SI Suspension SI Suspension | మిల్స్​కాలనీ ఎస్సై సస్పెన్షన్​
Next Article Ram Navami Rally Rules Ram Navami Rally Rules | సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి: సీపీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?