అక్షరటుడే, ఆర్మూర్: Red Jowar Bonus | ఎర్ర జొన్నలకు రూ.500 బోనస్ (Crop Bonus Demand) అందజేయాలని.. ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల్లో ఎర్రజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidhi Rakesh Reddy) కోరారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో (Telangana Assembly) మాట్లాడారు.
Red Jowar Bonus | ఆర్మూర్‌లో అనేక సమస్యలు..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో (Agriculture Policy) భాగంగా బుధవారం జీరో అవర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మూర్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని (Farmer Issues) ఇప్పటివరకు చాలాసార్లు అసెంబ్లీలో ప్రస్తావించానన్నారు. నియోజకవర్గంలోని (Nizamabad News) అంకాపూర్, గోవింద్‌పేట్, డొంకేశ్వర్, నందిపేట్ గ్రామాల రోడ్లు గుంతలతో నిండిపోయాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో పనులు చేయడానికి బిల్లులు రాక కాంట్రాక్టర్ పనులు చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కోరిన విధంగా వ్యవసాయం, ఆర్అండ్బీ, విద్యాశాఖ సంబంధించిన లేవనెత్తిన అంశాలపై నోట్ చేసుకొని సంబంధిత మంత్రులకు చేరవేస్తారంటూ సమాధానం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Pancha Reddy Suresh death | పంచరెడ్డి సురేష్ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది: ఎమ్మెల్యే ధన్పాల్

