అక్షరటుడే, ఆర్మూర్: Red Sorghum Farmers Demand | ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే రూ.4వేలకు క్వింటాలు చొప్పున కొనుగోలు చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు ప్రభాకర్, మంథని గంగారాం, జక్కలింగారెడ్డి, దేవారంలు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar)కు వినతిపత్రం అందజేశారు.
Red Sorghum Farmers Demand | రైతుల సమస్యలు పరిష్కరించాలి..
పసుపు ధరను కృత్రిమంగా తగ్గించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ అధికారుల నిర్లక్ష్యంపై చర్య తీసుకోవాలని.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశారని మన జిల్లాలోనే ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. దీనికి అదనపు కలెక్టర్ స్పందిస్తూ.. మార్క్‌ఫెడ్ అధికారులతో మాట్లాడి త్వరలో కేంద్రాలు ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం జరిగితే రైతులు నిండా మునుగుతారని.. వ్యాపారవర్గాలు లాభ పడతారన్నారు.
Red Sorghum Farmers Demand | వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు..
ఈ సందర్భంగా పసుపు కొనుగోలు విషయాల్లో మార్కెట్ అధికారులు (Market Officers) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. వ్యాపారులతో అంతర్గత ఒప్పందాల కారణంగానే రైతులు నష్టపోతున్నారని వారు ఆరోపించారు. సోమవారం వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే పసుపునకు ధర తక్కువ తగ్గించడానికి జరిగే ప్రయత్నాలను అధికారులు అడ్డుకోవాలని గుర్తు చేశారు. వందలాదిమంది తెచ్చే పసుపునకు ఒకరిద్దరూ తెచ్చే పచ్చి పసుపు వల్ల వందల మంది నష్టపోతారని పచ్చి పసుపు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Mopal Police Inspection | మోపాల్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య

