అక్షరటుడే, భీమ్‌గల్: Red Sorghum Price | ఎర్రజొన్న సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)తో ఫోన్‌లో మాట్లాడారు.
Red Sorghum Price | వ్యాపారులు సిండికేట్ కావడంతో..
వ్యాపారుల సిండికేట్ కావడంతో ధర పడిపోతున్న తీరును ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (MLA Prashanth Reddy)కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీజన్ ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.3,850 పలికిన ధరను, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రూ.3,450కి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతేడాది 34వేల ఎకరాల్లో సాగైన పంట, ఈసారి 23వేల ఎకరాలకే పరిమితమైందన్నారు.
Red Sorghum Price | ఉత్పత్తి తగ్గినప్పుడు..

ఉత్పత్తి తగ్గినప్పుడు ధర పెరగాల్సి ఉండగా, తగ్గించడం వెనుక కుట్ర ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యుద్ధాల సాకుతో రైతులను ముంచడం సరికాదని, విత్తనాలు ఇచ్చే సమయంలోనే వ్యాపారులు ‘బైబ్యాక్ అగ్రిమెంట్’ చేసుకోవాలన్న నిబంధనను కఠినంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ స్పందిస్తూ.. అధికారులతో సమీక్షించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: TRESA Insurance Support | రెవెన్యూ ఉద్యోగులకు ట్రెసా అండ.. రూ.75 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ

