Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Reels Stunt Death | రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. తుపాకీతో స్టంట్ చేస్తూ యువకుడు మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Reels Stunt Death | రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. తుపాకీతో స్టంట్ చేస్తూ యువకుడు మృతి

జాతీయం

Reels Stunt Death | రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. తుపాకీతో స్టంట్ చేస్తూ యువకుడు మృతి

ఢిల్లీలో రీల్ చేయబోయిన ఓ యువకుడు లోడ్ చేసిన తుపాకీతో స్టంట్ చేస్తూ ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్ నొక్కడంతో గుండెల్లో బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 18, 2026 10:00 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Reels Stunt Death

అక్షరటుడే, వెబ్​డెస్క్: Reels Stunt Death | సోషల్ మీడియా (Social Media) రీల్స్ కోసం యువత ప్రమాదకర స్టంట్లు చేయడం రోజురోజుకు పెరుగుతోంది. వ్యూస్, లైక్స్ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ విషాద ఘటన రీల్స్ పిచ్చి ఎంత ప్రమాదకరమో మరోసారి చూపించింది.

Contents
  • Reels Stunt Death | చేజేతులారా..
    • Reels Stunt Death | దర్యాప్తు చేపట్టిన పోలీసులు

తూర్పు ఢిల్లీకి (East Delhi) చెందిన పవన్ అనే యువకుడు సోషల్ మీడియా కోసం రీల్ చేయబోతూ ప్రమాదానికి గురయ్యాడు. సమాచారం ప్రకారం.. పవన్ తన స్నేహితుడితో కలిసి ఒక వీడియో షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పవన్ తుపాకీతో స్టంట్ చేస్తూ వీడియో తీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Reels Stunt Death | చేజేతులారా..

వీడియోలో పవన్ చేతిలో లోడ్ చేసిన తుపాకీ కనిపిస్తోంది. గన్ బటన్ ఎలా నొక్కాలో అతని స్నేహితుడు చెబుతుండగా పవన్ తుపాకీని లోడ్ చేసి ఛాతీ వైపు గురిపెట్టాడు. కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ స్టంట్ చేయబోతున్నట్లు వీడియోలో కనిపించింది. అయితే వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి “కాల్చొద్దు అన్నా..” అని హెచ్చరించినప్పటికీ పవన్ గందరగోళంలో తుపాకీ ట్రిగ్గర్‌ను నొక్కేశాడు. వెంటనే బుల్లెట్ అతని గుండెల్లోకి దూసుకెళ్లింది. దీంతో పవన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్నేహితులు వెంటనే స్పందించి పవన్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను తీవ్రంగా గాయపడడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Reels Stunt Death | దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పవన్ వాడిన తుపాకీ అతని స్నేహితుడిదేనని, దానికి లైసెన్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే తుపాకీ ఎలా లోడ్ అయింది. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వ్యూస్, లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టే స్టంట్లు చేయొద్దని, సోషల్ మీడియా కోసం ఇలాంటి ప్రమాదకర చర్యలు చేయడం వల్ల కుటుంబాలు నష్టపోతాయని పలువురు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!

IndiGo Flight Services | ‘ఇండిగో’ నుంచి కీలక అప్​డేట్​.. మధ్యప్రాచ్యం, ఎంపిక చేసిన యూరప్ మార్గాల్లో విమాన సేవలు
Middle East Oil Crisis | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇంధన ధరల పెంపుపై కేంద్రం స్పష్టత..
Modi YouTube Subscribers | సోషల్ మీడియాలో మోదీ హవా.. 3 కోట్లు దాటిన యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లు
IRCTC Pilgrimage Tour | ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ.. పుణ్యక్షేత్రాల సందర్శనకు భారత్‌ గౌరవ్‌ రైలు
Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
TAGGED:dangerous reels trenddelhi youth deathgun stunt tragedyindia news reelsReels Stunt Deathsocial media riskssocial media stunt accidentviral stunt accident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gold Rates India Gold Rates India | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
Next Article Kuldeep Reception Kuldeep Yadav Reception | అట్ట‌హాసంగా కుల్దీప్ యాదవ్ వెడ్డింగ్ రిసెప్షన్.. శాకాహార విందుతో అతిథులను మెప్పించిన టీమిండియా స్పిన్నర్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?