అక్షరటుడే, వెబ్డెస్క్ : Registration Server Issue | రాష్ట్రంలో మంగళవారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్వర్ సమస్యతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్లు జరగలేదు.
రాష్ట్రంలో నిత్యం వేలాది డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. అయితే మంగళవారం రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ఉదయం నుంచి సర్వర్ మొరాయించింది. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో (Registration Offices) సేవలు అందలేదు. క్రయ, విక్రయాలు, స్లాట్ బుకింగ్ (Slot Booking), చెల్లింపులు చేయడానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Registration Server Issue | పడిగాపులు
గతంలో స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చిన ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. సర్వర్ వస్తే పనులు చేసుకొని వెళ్దామని నిరీక్షించారు. అయితే సాయంత్రం వరకు కూడా సర్వర్ రాలేదు. సాంకేతిక సమస్యలతో సర్వర్లు పని చేయలేదని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. స్లాట్ బుకింగ్లు, చలాన్ల చెల్లింపులు పైతం ఆగిపోయాయి.
Registration Server Issue | వసతులు కరువు
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వసతులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అందులో కనీస వసతులు లేవు. మరోవైపు సర్వర్ రాకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా మంది ఆఫీసుల్లోనే వేచి ఉన్నారు. దీంతో రద్దీ నెలకొంది. అయితే అక్కడ వసతులు లేకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా సర్వర్ సమస్య పరిష్కరించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
దీనిని కూడా చదవండి : SI Caught by ACB | యూపీఐ ద్వారా లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

