అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy Campaign | కేరళం రాష్ట్రం (Kerala State)లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ శ్రమిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు అక్కడ ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్‌రెడ్డిని కేరళం ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రెండు రోజుల పాటు ప్రచారంలో పాల్గొనడానికి మంగళవారం సాయంత్రం కేరళ వెళ్లారు. బుధవారం ఉదయం నెమోమ్ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.
Revanth Reddy Campaign | వారి ఇద్దరి మధ్య తేడా లేదు
అధికార ఎల్డీఎఫ్ కూటమికి ఓటు వేస్తే అది ఢిల్లీలోని నరేంద్ర మోదీ (Narendra Modi)కి చేరుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మోదీకి, పినరయ్ విజయన్‌కు మధ్య తేడా లేదన్నారు. కేరళ ప్రజలు తెలివైన వాళ్లని, విద్యావంతులని సీఎం అన్నారు. వాళ్లు కమ్యూనల్ పీపుల్స్‌ను కేరళలోకి అనుమతించరని చెప్పరు. నరేంద్ర మోదీ కేరళ అభివృద్ధి, భవిష్యత్‌ను కిడ్నాప్ చేస్తారని ఆరోపించారు. యూడీఎఫ్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.
ఇది కూడా చదవండి..: Kondagattu temple accident | కొండగట్టులో అపశృతి.. 15 మంది భక్తులకు గాయాలు
