అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy Comments | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి Revanth Reddy రాజకీయ ప్రత్యర్థులపై ఘాటుగా స్పందించారు. జగిత్యాల సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించనని స్పష్టం చేసిన ఆయన.. బీఆర్‌ఎస్ నేతల విమర్శలకు మాత్రం స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు.
Revanth Reddy Comments | కేటీఆర్‌పై…
ముఖ్యంగా భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ K. T. Rama Rao చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సీనియర్లకు అవమానం జరిగిందని మాట్లాడే ముందు వారి పార్టీ నుంచి పలువురు సీనియర్ నేతలు ఎందుకు బయటకు వెళ్లిపోయారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు.
Allam Narayana, Vijayashanti, Eatala Rajender వంటి నేతలకు బీఆర్‌ఎస్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అలాగే పార్టీలో చేరిన Ponnala Lakshmaiah ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఆలోచించాలన్నారు.
టీఆర్‌ఎస్ కాలంలో నేతలకు జరిగిన అవమానాలను మరచిపోయిన కేటీఆర్… ఇప్పుడేమో సీనియర్ల గౌరవం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రేవంత్ రెడ్డి, “సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు” అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఇది కూడా చదవండి: Spiritual Possession | పూనకాలు, శివాలెత్తడం దైవశక్తా.. మానసిక జబ్బా.. నిజమేదీ?
