Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Revanth Reddy EV Plan | డీజిల్​ బస్సులను తొలగిస్తాం.. త్వరలో విద్యార్థినులకు స్కూటీలు : సీఎం రేవంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Revanth Reddy EV Plan | డీజిల్​ బస్సులను తొలగిస్తాం.. త్వరలో విద్యార్థినులకు స్కూటీలు : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణ

Revanth Reddy EV Plan | డీజిల్​ బస్సులను తొలగిస్తాం.. త్వరలో విద్యార్థినులకు స్కూటీలు : సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్​ నగరంలో ఆర్టీసీలో డీజిల్​ బస్సులు లేకుండా చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. త్వరలో జర్నలిస్ట్​లకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 8, 2026 1:02 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Revanth Reddy EV Plan

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy EV Plan | హైదరాబాద్​ (Hyderabad) నగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఈ మేరకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. మహిళా దినోత్సవం (Women’s Day) సందర్భంగా ప్రజాభవన్​లో మహిళా జర్నలిస్ట్​లతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు.

Contents
  • Revanth Reddy EV Plan | ఈవీ బైక్​లకు ప్రోత్సాహం
    • Revanth Reddy EV Plan | ఉన్నత స్థాయికి చేరాలి
      • Revanth Reddy EV Plan | ప్రోత్సహించాలి
      • ఇద్దరిని కనాలి
      • మూసీ ప్రక్షాళన చేస్తాం
      • జర్నలిస్ట్​లకు ఇళ్ల స్థలాలు

దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్​ గొప్పదన్నారు. మిగతా నగరాలు కాలుష్యం, ట్రాఫిక్​, వరదలతో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. హైదరాబాద్​కు ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమలను ఓఆర్​ఆర్ (ORR)​ అవతలకు తరలిస్తామన్నారు. కాలుష్య కారకమైన వాహనాలను సైతం నిషేధిస్తాని పేర్కొన్నారు. 2026 డిసెంబర్​ వరకు హైదరాబాద్​లో ఆర్టీసీ డీజిల్​ బస్సులు లేకుండా చేస్తామన్నారు. మొత్తం విద్యుత్​ బస్సులు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే 500 బస్సులు కొనుగోలు చేశామని, 2500 బస్సులు త్వరలో కొనుగోలు చేస్తామన్నారు.

Revanth Reddy EV Plan | ఈవీ బైక్​లకు ప్రోత్సాహం

నగరంలోని రెండు లక్షల ఆటోలను సైతం విద్యుత్​తో నడిచేలా మారుస్తామన్నారు. ఈవీ బైక్​లపై పన్నులు రద్దు చేశామన్నారు. త్వరలో విద్యార్థినులకు ఎలక్ట్రిక్​ స్కూటీలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం సాధ్యం కాకపోవచ్చని, అయితే త్వరలో స్కూటీలు ఇస్తామన్నారు. హైదరాబాద్​ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్తామన్నారు.

Revanth Reddy EV Plan | ఉన్నత స్థాయికి చేరాలి

తెలంగాణ మహిళలు తయారుచేసే వస్తువులకు అమెజాన్‌లో అమ్మకానికి అవకాశం కల్పించామని రేవంత్​రెడ్డి తెలిపారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలు అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. మహిళా సంఘాలు వెయ్యి బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చాయన్నారు. సౌర విద్యుత్​ ఉత్పత్తిలో సైతం మహిళా సంఘాలకు చేయూత అందిస్తున్నట్లు తెలిపారు.

Revanth Reddy EV Plan | ప్రోత్సహించాలి

మహిళల ఆర్థిక శక్తి పెరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం పేర్కొన్నారు. దేశంలో మహిళల శ్రమకు గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో మహిళలపై వివక్ష ఉందన్నారు. అమెరికాలో సైతం వివక్ష ఉందని పేర్కొన్నారు. కానీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉందని, మన దగ్గర అది లేదన్నారు.

ఇద్దరిని కనాలి

తెలంగాణలో జనాభా పెరగడం లేదని సీఎం చెప్పారు. గతంలో కుటుంబ నియంత్రణతో పాపులేషన్​ పెరగడం లేదన్నారు. యువత మేమిద్దరం.. మాకు ఒక్కరు అనుకుంటున్నారని, కనీసం మాకు ఇద్దరు అనుకున్న జనాభా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

మూసీ ప్రక్షాళన చేస్తాం

మూసీ (Musi River) ప్రక్షాళన ఎందుకు చేయొద్దని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈసా నదిని నాలా అని చూపి అక్రమంగా అపార్ట్​మెంట్​ కట్టారన్నారు. నాలాకు పది మీటర్లు, నదికి 50 మీటర్లు బఫర్​ జోన్​ అని చట్టం ఉందన్నారు. అపార్ట్​మెంట్​ వాసులు నష్టపోకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బఫర్​ జోన్​ పరిధిలో ఉన్న నిర్మాణాలకు విలువ లేదని చెప్పారు. వాటిని తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు. దీనిపై ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన బాధితులకు సూచించారు.

జర్నలిస్ట్​లకు ఇళ్ల స్థలాలు

సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారాలపై ఫిర్యాదు చేయడానికి ఓ వేదిక రూపొందిస్తామని సీఎం తెలిపారు. దీనికోసం చట్టం తెస్తామన్నారు. డెస్క్​ జర్నలిస్ట్​లు (Desk Journalists), ఫీల్డ్​ జర్నలిస్ట్​లకు తేడా లేదన్నారు. అందరికి అక్రిడిటేషన్​ కార్డులు ఇస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాలపై త్వరలో ప్రకటన చేస్తామని తెలిపారు. ఫ్యూచర్​ సిటీలో జర్నలిస్ట్​లకు ఒక కాలనీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

journalists

దీనిని కూడా చదవండి : Indiramma houses second phase | ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. ఏప్రిల్​ 1 నుంచి రెండో విడత

SC Reservations | ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి : కల్వకుంట్ల కవిత
SI Suspension | మిల్స్​కాలనీ ఎస్సై సస్పెన్షన్​
SI Caught by ACB | యూపీఐ ద్వారా లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై
ACB Corruption Arrest | ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్​ సీఐ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
UPSC Results | సివిల్స్​లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు
TAGGED:diesel buses ban hyderabadelectric scooters for studentshyderabad electric buseshyderabad pollution controlrevanth reddy ev plantelangana ev policytelangana government news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article CA Results 2026 CA Results 2026 | సీఏ ఫలితాలు విడుదల
Next Article US Tornado Outbreak US Tornado Outbreak | అమెరికాలో టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?