అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy Failure | పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) విఫలం అయ్యారని మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. రెండున్నరేళ్లలో రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు.
జీవన్‌రెడ్డి (Jeevan Reddy) ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ క్రమంలో నేడు (గురువారం) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలలో జీవన్‌రెడ్డితో భేటీ కానున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరారు. కేటీఆర్‌తో భేటీ నేపథ్యంలో జీవన్‌రెడ్డి ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Failure | వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని జీవన్‌రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన 100 రెట్లు బెటర్ అని పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఏ రోజు చేరుతాననే విషయాన్ని కేటీఆర్‌తో భేటీ అనంతరం చెబుతానన్నారు. రెండున్నరేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో విఫలం అయ్యారని విమర్శించారు.
Revanth Reddy Failure | మార్పు కోరుకుంటున్నారు
పదేళ్ల కేసీఆర్ (KCR) పాలన కంటే మెరుగైన పాలన వస్తుందని తాము ఆశించామన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో తిరోగమనంలో పయనిస్తుందన్నారు. దీంతో రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కావడంతో ఆ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నట్లు పేర్కొన్నారు.సీఎం రేవంత్‌రెడ్డి రైతు బంధు పథకాన్ని నీరు గార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. మేడిగడ్డను బాగు చేయలేదని, తుమ్మిడిహట్టి వద్ద పనులు రెండున్నరేళ్లు అవుతున్నా.. అడుగు కూడా కదలలేదన్నారు. రేవంత్‌రెడ్డి మిగిలిన పాలన కాలంలో అయినా.. మంచి పరిపాలన చేయాలని హితవు పలికారు
ఇది కూడా చదవండి..: Mutton Choking Death | ప్రాణం తీసిన మటన్ ముక్క
